24235 వార్తలు







హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతం బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ యూనిట్ లో ఆయుధాలను అపహరించారు. తోటి అధికారికి సెలవు ఇవ్వకపోవడంతో ఆయుధాలు ఎత్తుకెళ్లినట్టు బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఆర్మీ అధికారులు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ ఆర్మీ సంబంధించిన ప్రాంతాల్లో ఆర్మీ చీఫ్ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆర్మీ, సివిల్ రహదారుల్లో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. బొల్లారంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లను ఆర్మీ అధికారులు మూసివేశారు. మిలిటరీ సైనిక విభాగానికి చెందిన బెల్ ఆఫ్ ఆర్మీ విభాగంలో నాలుగు ఏకే 47 తుపాకులు కనపడకుండాపోయినట్టు అధికారులు తెలిపారు. మిలిటరీ బ్రిగేడియర్ బొల్లారం పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.

హైదరాబాద్: కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో హర్షవర్ధన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ’కూర్మ అవతార్’. నరేంద్ర కొం డ సమర్పణలో పంచవక్త్ర పిక్చర్స్, రుక్వీణ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూజి త, సేవిత నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సాయి కుమార్, శివాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా టీజర్‌ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ సినిమా నరసింహ అవతార్, ఇరుముడి సినిమాల్లాగే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నానని అ న్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ “కూర్మావతార్’ సినిమాలో నేను భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు హర్ష అద్భుతమైన విజన్‌తో ఈ సినిమాను తీశారు”అని పేర్కొన్నా రు. డైరెక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ కథ చెప్పగానే ఈ పాత్రను అంగీకరించిన శివరాజ్ కుమార్‌కు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, రాజ్ తరుణ్, నరేంద్ర, పూజిత, అజనీష్ లోక్‌నాథ్ పాల్గొన్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ తర్వాత ఐశ్వర్య రాజేష్ తెలుగులో వరుస సినిమాలతో బిజీబిజీగా మారింది. సెప్టెంబర్‌లో సుమంత్‌తో సినిమా, డిసెంబర్‌లో నాగార్జునతో మరో సినిమా, సంక్రాంతికి రవితేజ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది. అంటే నాలుగు నెలల వ్యవధిలో మూడు తెలుగు సినిమాల్లో కనిపించే అవకాశం వచ్చింది. ముందుగా సెప్టెంబర్ 11న ‘మహేంద్రగిరి వారాహి’ వస్తోంది. సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించింది. దాని తర్వాత నాగార్జున ‘కింగ్ 100’లో కూడా ఐశ్వర్య నటిస్తోంది. ఇక మూడోది రవితేజ, హసిత్ గోలి సినిమా. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని సమాచారం. ఐశ్వర్య రాజేష్‌ను రవితేజకు జోడీగా తీసుకున్నట్లు టాక్ వస్తోంది.

మన తెలంగాణ/మోత్కూర్ వనమహోత్సవంలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ లోని అన్నెపువాడ లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. మున్సిపల్ కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న గౌడ్ స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్ల వెంట పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. “ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు పచ్చదనం పెంపొందించడం మనందరి బాధ్యత” కారుపోతుల వెంకన్న అని తెలియజేశారు. కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ రాచర్ల సంధ్య రాణి ,అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్ ఎడ్ల నరేందర్, నక్క రాజు, కనుకు సతీష్, కారుపోతుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి: అనుమానంగా సంచరిస్తున్న యువకులను వివరాలు అడిగినందుకు కానిస్టేబుల్‌పై కత్తితో ఆగంతకులు దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యర్నగూడెం వంతెన వద్ద ఆయిల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. కానిస్టేబుల్ వెంకటేశ్వర రావు, లోవరాజు అక్కడి చేరుకొని ట్రాఫిక్‌కు క్లియర్ చేస్తున్నారు. అప్పుడే నలుగురు యువకుడు అక్కడ అనుమానాస్పదంగా తిరగడంతో కానిస్టేబుల్ వారిని వివరాలు అడిగాడు. బ్యాగులో నుంచి కత్తి తీసి కానిస్టేబుల్‌ను రెండు సార్లు పొడిచారు. అనంతరం నలుగురు బైక్‌ల మీద పారిపోయారు. వెంటనే కానిస్టేబుల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అదే ప్రాంతంలో ఉన్న కనకదుర్గ ఆలయంలో చోరీ జరిగిందని గ్రామస్థులు గుర్తించారు. కానిస్టేబుల్‌పై దాడి, ఆలయంలో చోరీ ఘటనలు ఒకే సారి జరగడంతో నలుగురు యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌పి నరసింహకిశోర్ ప్రైవేటు ఆస్పత్రికి చేరుకొని కానిస్టేబుల్‌ను పరామర్శించారు.

ఢిల్లీ: పుస్తకం తెచ్చుకోలేదని టీచర్ ఎండలో నిలబెట్టడంతో విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఢిల్లీలోని తూర్పు వినోద్ నగర్‌లో జరిగింది. విద్యార్థిని తల్లి అంజలి తెలిపిన వివరాల ప్రకారం... ఆగస్టు 27న తన కూతురు తనకు ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లేసరికి తన కూతురు ఎండలో నిల్చొని ఉండడంతో పాటు అప్పటికే ఆమె ఆరోగ్యం బాగా క్షీణించి స్పృహతప్పి పడిపోయింది. వెంటనే తన కూతురును ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పుస్తకం తెచ్చుకోనందుకు పాపను ఎండలో నిలబెట్టారని తల్లి అంజలి ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.










పోర్న్‌తో స్మార్ట్ ఫోన్ హ్యాక్..పోర్నోగ్రఫీ, ఎంటర్‌టైన్‌మెంట్ పేరిట లింకులు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు
