10867 వార్తలు

భీమవరం: గేయ రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని 5 సెంట్ల ఉమ్మడి స్థలం ఆక్రమించారంటూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్, ఎస్పికి వినతిపత్రం అందించారు. హరి రామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. స్థల వివాదం కోర్టులో ఉందని.. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని వినతి పత్రంలో అనంత శ్రీరామ్ కోరారు.

ఇండియాలో కోడాక్ టీవీల అధికారిక బ్రాండ్ లైసెన్సీ అయిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోడాక్ బ్రాండ్ క్రింద 2026 శ్రేణి మ్యాట్రిక్స్ QLED గూగుల్ టీవీలను విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్‌లో 32-అంగుళాలు, 40-అంగుళాలు, 43-అంగుళాల మోడళ్లు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో QLED ప్యానెల్‌తో కూడిన సరసమైన స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ విడుదల జరిగింది. ఇప్పుడు వీటి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ధర, లభ్యత కోడాక్ మ్యాట్రిక్స్ క్యూఎల్ఈడి గూగుల్ టీవీ 2026 మోడళ్ల ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 32-అంగుళాల మోడల్: ₹10,999 40-అంగుళాల మోడల్: ₹15,999 43-అంగుళాల మోడల్: ₹16,999 అన్ని మోడళ్లు భారతదేశంలో సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఫీచర్లు ఈ టీవీ సిరీస్‌లో అతిపెద్ద హైలైట్ దాని QLED ప్యానెల్. ఈ డిస్‌ప్లే టెక్నాలజీ మూడు స్క్రీన్ సైజులలోనూ అందుబాటులో ఉంది. ఎల్ఈడీ టీవీలతో పోలిస్తే ఇది మెరుగైన బ్రైట్‌నెస్, అత్యుత్తమ కలర్ రిప్రొడక్షన్, విస్తృత వీక్షణ కోణాలను అంది





షియోమీ 17 మ్యాక్స్, షియోమీ ఇయర్ క్లిప్ ఇయర్‌ఫోన్‌లతో పాటు షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో స్మార్ట్‌వాచ్ చైనాలో విడుదల అయింది. షియోమీ, అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో కూడిన స్టాండర్డ్ ఎడిషన్‌తో పాటు, ఫ్లోరోరబ్బర్ స్ట్రాప్‌తో కూడిన షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో ప్రీమియం సిరామిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. ధర గురించి మాట్లాడితే, షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో స్టాండర్డ్ వెర్షన్ ధర CNY 399 (సుమారుగా రూ. 5,600). లెదర్ స్ట్రాప్ వేరియంట్ ధర CNY 449 (సుమారుగా రూ. 6,500). సెరామిక్ వేరియంట్ ధర CNY 479 (సుమారుగా రూ. 6,700). కాగా, ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, చెర్రీ బ్లాసమ్ పింక్, కోరల్ ఆరెంజ్, చీజ్ వైట్, సెరామిక్ వైట్, సిల్వర్ రంగులలో లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో షియోమీ హైపర్ఓఎస్ 3 ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. 336×480 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 1.74-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రొటెక్షన్ కోసం ఇది 2.5D టెంపర్డ్ గ్లాస్ కవర్‌ను కలిగి ఉంది. ఆరోగ్య పర్యవేక్షణ కోసం, షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రోలో డ్యూయల్-లైట్ PPD సెన్సార్‌ను అమర్చారు. ఇది 9

ఐపిఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పరిచయం అవసరం లేని పేరు. 15 ఏళ్ల వయస్సులోనే ఈ కుర్రాడు బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. తనదైన శైలీ దూకుడుతో బ్యాటింగ్ చేస్తూ.. రికార్డులు తిరగరాస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్‌సన్ ఇచ్చిన ఓ ఛాలెంజ్‌ని సునాయాసంగా పూర్తి చేశాడు వైభవ్. తన యూట్యూబ్ ఛానల్‌లో పీటర్‌సన్ 50 బంతుల్లో సెంచరీ చేయాలనే ఛాలెంజ్ నిర్వహిస్తున్నాడు. ఈ ఛాలెంజ్‌లో తాజాగా వైభవ్ పాల్గొన్నాడు. కేవలం 25 బంతుల్లోనే 14 సిక్సర్లు బాది 104 పరుగులు చేశారు. అయితే ఈ ఛాలెంజ్‌లో శ్రేయస్ అయ్యర్ రికార్డును మాత్రం వైభవ్ బద్దలుకొట్టలేకపోయాడు. అయ్యర్ కేవలం 22 బంతుల్లోనే ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. ఇదే ఎపిసోడ్‌లో వైభవ్ తన కోరికను వెల్లడించాడు. టి-20ల్లో డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని వైభవ్ తెలిపాడు. టి-20 క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013 ఐపిఎల్ సీజన్‌లో గేల్ ఆర్సిబి తరఫున 175 పరుగులు చేశాడు. ఈ రికార్డును బద్దలుకొట్టడమే కాకుండా.. టి-20ల్లో డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని వైభవ్ మరోసారి స్పష్టం చేశాడు. కాగా, ఐపిఎల్ 2026లో ర


హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. యూత్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని చెప్పిందని అన్నారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ.. యూత్ డిక్లరేషన్ పై 30న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేస్తామని, ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో చలో సరూర్ నగర్ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. రైతులు, విద్యార్థుల విషయంలో ప్రభుత్వంలో చలనం లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. లక్షల మంది విద్యార్థులను ఖర్చు లేకుండా చదివిస్తామన్నారని, విదేశీ విద్య విషయంలో మాజీ సిఎం కెసిఆర్ ఇచ్చిన నిధుల కంటే ఎక్కువ ఇస్తామన్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక విద్యార్థులకు మెమోలు ఇవ్వని కాలేజీ యాజమాన్యాలు అని విమర్శించారు. విద్య విషయంలో అతి తక్కువ కాలంలోనే అద్భుతాలు చేసిన ఘనత కెసిఆర్ ది అని కొనియాడారు. రేవంత్ మాటలు కోటలు దాటుతున్నా..చేతలు దాటడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మేల్కోకపోతే జూన్ లో నిరసన కార్యక్రమాలతో కనువిప్పు కలిగేలా చేస్తామని, యూత్ డిక్లరేషన్ హామీలు అమలు

నవతెలంగాణ-హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శర్మ చేసిన బొద్దింకల వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. ఆ తర్వాత “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ క్రమంలో న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగుతోందని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని అత్యవసర విచారణలు జరపాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్లను పరిశీలించారు. అయితే ఈ అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దంటూ సీజేఐ […] The post అంత సీరియస్‌గా తీసుకోవద్దు: జస్టిస్ సూర్యకాంత్ శర్మ appeared first on Navatelangana.

వేసవికాలంలో పల్లీలను పచ్చిగా లేదా వేయించుకుని తినడానికి బదులుగా నానబెట్టి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పల్లీలు రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తరచుగా వీటిని ఈ సీజన్ లో తినడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ నేపథ్యంలో వేసవిలో నానబెట్టిన పల్లీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో నానబెట్టిన పల్లీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 1. పచ్చి పల్లీలలో ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది కడుపులో భారంగా, గ్యాస్‌కు కారణమవుతుంది. కాబట్టి, వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల ఈ యాసిడ్ తొలగిపోతుంది. దీనివల్ల పల్లీలలోని ఫైబర్ సులభంగా జీర్ణమవుతుంది. వేసవిలో సాధారణంగా వచ్చే మలబద్ధకం, అజీర్ణం, ఎసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుంది. 2. నానబెట్టే ప్రక్రియ పల్లీలలోని విటమిన్లు, ఖనిజాలను క్రియాశీలం చేస్తుంది. నానబెట్టిన పల్లీలలో ఉండే ఐరన్, కాల్షియం, విటమిన్ ఇ, పొటాషియంలను శరీరం సులభంగా గ్రహించి, సంపూర్ణ పోషణను అందిస్తుంది. 3. వేసవిలో అధిక ఎండ, చెమ

నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం ఢిల్లీ వేదికగా జరిగిన 37వ SIDBI ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, అలాంటి వాటికి తావులేదని స్పష్టం చేశారు. దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, […] The post దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: నిర్మలా సీతారామన్ appeared first on Navatelangana.


రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాన్ రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో ఆయన పడవలో ప్రయాణించారు. పడవలో ప్రయాణిస్తూనే పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఘాట్ల వద్ద పరిస్థితిని తెలుసుకుంటూ ఫోటోలు తీసుకున్నారు. పుష్కర్‌ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పవన్ బోటులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బోటులో ప్రయాణిస్తూనే ప్రజలతో పవన్ సెల్ఫీ తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నవతెలంగాణ-హైదరాబాద్: నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్‌కు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్ సోమవారం నాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నవీన్ పట్నాయక్‌కు పంపారు. పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేకపోవడం, తన సేవలు పార్టీకి అంతగా అవసరం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. రాజీనామా అనంతరం సమంతరాయ్ మాట్లాడుతూ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌కు […] The post రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్ రాజీనామా appeared first on Navatelangana.




ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రంభ తండ్రి వెంకటేశ్వరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని రంభ సోషల్‌మీడియా ద్వారా తెలియజేశారు. తండ్రిని తలుచుకుని చాలా భావోద్వేగానికి గురైంది. ‘‘నా హృదయంలో నీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ నీ ముఖంపై చిరునవ్వు మాత్రం చెరగిపోనివ్వలేదు. నువ్వు వెళ్లిపోవడంతో నా ప్రపంచం శూన్యమైపోయింది’’ అని రంభ రాసుకొచ్చింది.

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రజల నడ్డి విరిచే విధంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ …. ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేయాలని, ప్రజా ప్రతినిధులను (ఎంపీలు, ఎమ్మెల్యేలను) నిలదీయాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సోమవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. వరుసగా నాలుగోసారి మళ్లీ ఈ రోజు రూ.2.86, రూ.2.84లు చొప్పున చమురు ధరలను […] The post ఇంధన ధరలు నాల్గోసారి పెంపు..నిరసనలకు సీపీఐ(ఎం) పిలుపు appeared first on Navatelangana.


హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి డిసిఎం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.