9872 వార్తలు


భారత టెక్ మార్కెట్లో రియల్‌మీ 16T తో పాటు రియల్‌మీ వాచ్ S5 కూడా అధికారికంగా విడుదలైంది. సాండ్ వైట్, రాక్ గ్రే వంటి రంగులలో లభిస్తోన్న ఈ వాచ్ అనేక హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లను అందిస్తుంది. అంతేకాదు, 110 స్పోర్ట్స్ మోడ్‌లకు, బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని ధర గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్‌వాచ్ రూ.7,999కు కొనుగోలు చేయవచ్చు. జూన్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి దీని సేల్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతాయి. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌వాచ్‌లో 1500 నిట్స్ ప్రకాశం, 60Hz రిఫ్రెష్ రేట్, ఆల్వేస్-ఆన్ ఆమోలెడ్ డిస్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 1.97-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తూ, ఈ వాచ్ బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. తద్వారా, ఈ వాచ్ నుంచే కాల్స్ చేయవచ్చు, స్వీకరించవచ్చు. ఇది రన్నింగ్, సైక్లింగ్, యోగా, బ్యాడ్మింటన్‌తో సహా 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. నావిగేషన్ కోసం, ఈ వాచ్‌లో 5-సిస్టమ్ GNSS పొజిషనింగ్‌తో కూడిన GPS ఫీచర్ ఉంది. 5ATM వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తున్న ఈ వాచ్ టచ్ ఇన్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి, తడి

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో ఆర్డివొగా పని చేసిన వంశీ మోహన్.. భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాలు కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. భూములను తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి.. ఆ తర్వాత రియల్టర్‌కు ధారదత్తం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్లు ఎసిబి గుర్తించింది. దీంతో వంశీ మోహన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.

ఈరోజుల్లో చాలమంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. శరీర బరువు నియంత్రణలో లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్రధానంగా, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే, దాని తగ్గించడం చాలా కష్టం అవుతుంది. అయితే, ఇంటి దగ్గరే తయారు చేసుకునే కొన్ని హెల్తీ డ్రింక్స్ కొవ్వును సులభంగా తగ్గిస్తాయి. వీటిని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే, జీవక్రియను గణనీయంగా పెంచుతాయి. అంతేకాకుండా, ఈ పానీయాలు కేలరీలను సులభంగా కరిగిస్తాయి. శరీరాన్ని లోపలి నుండి డిటాక్స్ చేస్తాయి. ఈ పానీయాలను సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం చేస్తూ తీసుకుంటే కేవలం ఒక నెలలోనే 4 నుండి 5 కిలోగ్రాముల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మరి బరువు తగ్గించే పానీయాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గోరువెచ్చని నిమ్మరసం సులభంగా బరువు తగ్గాలనుకుంటే గోరువెచ్చని నిమ్మరసం ఉత్తమమైన ఎంపిక! ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని లోపలి నుండి డిటాక్స్ చేస్తాయి. గోరువెచ్చని నీరు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. నిమ్మరసంతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతు




నవతెలంగాణ-హైదరాబాద్: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌లు అయితే వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించింది. సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వచ్చిన కుటుంబాలు పదే పదే కోటా ప్రయోజనాలు పొందడం అవసరమా అన్న సుప్రీంకోర్టు.. రిజర్వేషన్ల ద్వారా సామాజిక స్థితిలో మార్పు సాధించిన కుటుంబాలు రిజర్వేషన్ వ్యవస్థ నుండి బయటకు రావాలి’అని స్పష్టం చేసింది రిజర్వేషన్లలో కొనసాగితే ఈడబ్ల్యూఎస్‌కు, క్రిమిలేయర్‌కు తేడా ఏముంటుంది?. ఆ రెండింటి మధ్య తేడా ఉండాల్సిందేనని తెలిపింది. ఓబీసీ […] The post తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌లు..పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా..? appeared first on Navatelangana.

కొయ్యుర్లో నిరవధిక సమ్మె ప్రారంభంనవతెలంగాణ – మల్హర్ రావుతమ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం మండలంలోని ఐకెపి విఓఏ జాయింట్ యాక్టివ్ మండల (జెఏసి సెర్ప్) కమిటీ ఆధ్వర్యంలో 27 మంది విఓఎలు కొయ్యుర్ మండల సమాఖ్య కార్యాలయంలో ముందు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా విఓఎలు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర విఓఏ జెఏసి కమిటీ ఆదేశాల మేరకు శాంతియుత నిరవధిక సమ్మె చేపట్టినట్లుగా పేర్కొన్నారు. విఓఏ సమస్యలైన కనీస వేతనం రూ.20 […] The post విఓఏల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.




నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టులో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు ఊరట లభించింది. రాబోయే ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో ఆమె ఫిట్‌నెస్‌పై నిపుణుల కమిటీ నియమించాలని డబ్ల్యూఎఫ్ఐ(Wrestling Federation of India)ని ధర్మాసనం ఆదేశించింది. శుక్రవారం విచారణ సందర్భంగా దేశంలో మాతృత్వాన్ని గౌరవిస్తారని, వేడుకగా జరుపుకుంటారని, కాబట్టి ఇలాంటి పరిస్థితులను న్యాయంగా పరిష్కరించాలని కోర్టు సూచించింది. ఫెడరేషన్‌లోని వివాదాల కారణంగా క్రీడలు దెబ్బతినకూడదని కోర్టు హితువు పలికింది.. మే 9న ఫోగాట్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ షో-కాజ్ నోటీసు జారీ […] The post ఢిల్లీ హైకోర్టులో రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు ఊరట appeared first on Navatelangana.

– సీఎం సహాయనిధి దరఖాస్తుల సిఫార్సు– స్థానికంగా ఉంటే ప్రజల్లోఎమ్మెల్యే జారె ఆదినారాయణ రోజువారీ దినచర్యనవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్థానికంగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని మండలాల్లో ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో పాల్గొంటూ, హైదరాబాద్‌కు వెళ్లిన సందర్భాల్లో నియోజకవర్గ ప్రజలకు వైద్య, సంక్షేమ సేవలు అందేలా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో నియోజకవర్గానికి చెందిన రోగులు ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో తెలుసుకుని వారిని పరామర్శించడం, అవసరమైన వారికి ఉచిత వైద్య […] The post హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన appeared first on Navatelangana.

-మూడు గంటల పాటు బైఠాయింపు-కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్నవతెలంగాణ-రాయికల్ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు రోజుల తరబడి అలాగే పేరుకుపోతుండగా, తరలింపు లేక రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాల భయం వెంటాడుతుండగా, మరోవైపు లారీలు, కూలీల కొరత రైతుల కష్టాలను మరింత పెంచుతోంది. “ప్రతి గింజ కొనుగోలు చేస్తాం”అని ప్రభుత్వం చెబుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల కన్నీటి గాధ ఆగడం లేదు. గత […] The post ధాన్యం తరలింపులో జాప్యం..రోడ్డెక్కిన రైతులు appeared first on Navatelangana.




బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘పెద్ది’. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. కొద్ది రోజుల క్రితమే సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. దీనికి అశేషమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ పాటలో చరణ్‌తో కలిసి శృతి హాసన్ చిందులు వేశారు. చీర.. చొక్కా.. చిక్కెడిపోవాలో.. అంటూ సాగే ఈ పాటలో ఇరువురు డ్యాన్స్ అదరగొట్టారు. ఈ పూర్తి పాటను రేపు భోపాల్‌లో జరగనున్న ఎఆర్ రెహమాన్ కాన్సర్ట్‌లో విడుదల చేయనున్నారు.



