
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ విధానాలు, పథకాల అమలుకు సంబంధించి రాజకీయ పార్టీలు, నేతలు బహిరంగ వేదికలపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోర్టులు ప్రభుత్వాన్ని ఆదేశించలేవని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఒక పథకాన్ని నిర్దిష్ట పద్ధతిలో అమలు చేయాలని కూడా కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవని తేల్చిచెప్పింది. పరిపాలనలో భాగంగా కార్యనిర్వాహక వర్గం రోజువారీ తీసుకునే నిర్ణయాలను నిత్యం పర్యవేక్షించే అధికారం, పరిధి కోర్టుకు లేదని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయ డం,
నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం కార్యనిర్వాహక విభాగం బాధ్యత ల్లో భాగమని స్పష్టం చేసింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి, రాజకీయ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కోర్టులను వేదికగా మార్చరాద ని సుప్రీంకోర్టు చేసిన హెచ్చరికలను గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో రా జ్యాంగపరమైన ఉల్లంఘనకు సం బంధించిన ఆధారాలు లేకుండా బిఆర్‌ఎస్ ఎమ్మె ల్యే తన్నీరు హరీష్‌రావు, బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషన్లకు విచారణార్హత లేదంటూ రిజిస్ట్రీ లేవనెత్తిన తరువాయి 9లో







