
న్యూఢిల్లీ: విద్యార్థులు దేశ భవిష్యత్తుకు రూపకర్తలని రా ష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమ పద్ధతులకు పూర్తిగా అడ్డుకట్ట వే సేందుకు సమగ్ర సంస్కరణలు చేపడుతున్నట్లు వెల్లడించా రు. పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దడమే ఈ సంస్కరణల ల క్ష్యమని తెలిపారు. దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సం దర్భంగా శుక్రవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగం లో రాష్ట్రపతి యువత భవిష్యత్తు, జాతీయ భద్రత, ఆర్థిక ప్రగ తి, మహిళా సాధికారత, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలను ప్రస్తావించారు. దేశ భద్రత కోసం ప్ర భుత్వం, సమాజం ఏకతాటిపై నిలిచినట్లే.. విద్యార్థుల వ ర్తమాన, భవిష్యత్తును కాపాడేందుకు కూడా అందరూ స మష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘ప్రభుత్వ పరీక్ష లు విద్యార్థులకు అవకాశాలకు ద్వారాలు.
వీటిని సంస్కరించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. అ క్రమ పద్ధతులను పూర్తిగా అరికట్టి, పరీక్షల వ్యవస్థను మ రింత పారదర్శకంగా, సురక్షితంగా, యువతకు విశ్వసనీయంగా మార్చడమే సంస్కరణల లక్ష్యం’ అని ముర్ము పే ర్కొన్నారు. ఇటీవలి కాలంలో పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రప తి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో దేశంలో బలమైన స్టార్టప్ వ్య వస్థ ఏర్పడిందని చెప్పారు. భారత యువత ప్రతిభ, అంకితభావాన్ని చూసి ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు వారికి కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాయని పేర్కొన్నారు. యువత సమగ్ర వికాసానికి క్రీడలు కీలకమని పే ర్కొంటూ ‘ఖేలోఇండియా’ కార్యక్రమాన్ని ప్రస్తావించారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
భారత సాయుధ దళాల ‘అసమాన ధైర్యసాహసాలను’ రాష్ట్రపతి కొనియాడారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదంపై ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించగల సామర్థ్యాన్ని సాయుధ దళాలు చాటాయని చెప్పారు. దశాబ్దాలుగా దేశానికి సవాలుగా నిలిచిన నక్సలిజాన్ని నిర్మూలించడం చారిత్రక విజయమని ముర్ము అన్నారు. ఒకప్పుడు నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు ఉత్సాహభరిత వాతావరణం నెలకొందన్నారు. సమ్మిళిత అభివృద్ధి, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ‘బస్తర్ ఒలింపిక్స్’, ‘బస్తర్ పండుమ్’ వంటి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
‘వసుధైక కుటుంబం’
మన విదేశాంగ విధానానికి పునాది
శాంతి, చర్చలు, సహకారం, ‘వసుధైవ కుటుంబకం’ భారత విదేశాంగ విధానానికి పునాదులని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు. నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను భారత్ విశ్వసిస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి సహా బహుపాక్షిక సంస్థల్లో ప్రపంచ సమాజానికి తగిన ప్రాతినిధ్యం ఉండేలా కృషి చేస్తున్నామని చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందని ముర్ము అన్నారు. ఆర్థికంగా పటిష్ఠత, విస్తృత డి జిటల్ మౌలిక సదుపాయాలు, సాధికార యువత, మహిళల భాగస్వామ్యం ఈ ప్రగతికి ప్రధాన బలాలని చెప్పా రు. ‘అంత్యోదయ’ స్ఫూర్తితో అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందేలా
చూడడమే దేశ ప్రధాన సంకల్పమన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అస్థిరత కారణంగా ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ దేశ ఆర్థిక ప్రగతి, జాతీయ భద్రతకు మరింత బలమైన పునాది వేసిందన్నారు. గత దశాబ్దంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని రాష్ట్రపతి తెలిపారు. ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’ ద్వారా దాదాపు 59 కోట్ల మంది బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారని, వారిలో 32 కోట్ల మందికి పైగా మహిళలేనన్నారు. 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత రేషన్ ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.
మహిళలే విజయపథంలో..
మహిళా సాధికారతకు తన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. మూడు కోట్ల ‘లఖ్‌పతి దీదీ’ల సృష్టి లక్ష్యాన్ని ఇప్పటికే సాధించామని, మరో మూడు కోట్ల మందిని లఖ్‌పతి దీదీలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ‘డ్రోన్ దీదీ’ వ్యవసాయ ఉ త్పాదకతను పెంచుతుండగా, వైమానిక దళంలో ‘ఫైటర్ కంబాట్ లీడర్’గా మహిళలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల గ్లాస్గోలో ముగిసిన కా మన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన 13 స్వర్ణ పతకాల్లో ఎ నిమిది మహిళలే గెలుచుకున్నారని గుర్తుచేశారు. 2023 లో అమల్లోకి వచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంతో భారత ప్రజాస్వామ్యం మరింత సమ్మిళితంగా మారుతుందని అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి...
స్వాతంత్య్ర సమరయోధులు, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌లకు రాష్ట్రపతి నివాళులర్పించారు. 550కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను స్మరించుకున్నారు. ఆగస్టు 14న నిర్వహిస్తున్న ‘విభజన్ విభీషికా స్మృతి దివస్’ను ప్రస్తావిస్తూ.. ఆ విషాదాన్ని దేశం ఎన్నటికీ మరచిపోదని గుర్తుచేశారు. చివరగా తెలుగు రచయిత గురజాడ అప్పారావు ప్రసిద్ధ వాక్యాలను ఉటంకించిన రాష్ట్రపతి.. ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న భావాన్ని గుర్తుచేశారు. 2047 నాటికి స్వతంత్ర భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.










