న్యూయార్క్‌లో సౌత్ ఇండియన్ మ్యూజిక్‌కు మరోసారి ఫుల్ జోష్ కనిపించింది. TE.TA.MA 16.0 ఆధ్వర్యంలో “New York Times Square Takeover” పేరుతో నిర్వహించిన గ్రాండ్ DJ నైట్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
EDEN – NYC వేదికగా జరిగిన ఈవెంట్ కి మంచి స్పందన లభించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పాటలతో వేదిక మొత్తం మ్యూజిక్ ఫెస్టివల్‌ను తలపించింది. ఫేవరెట్ సాంగ్స్‌కు యువత స్టెప్పులేస్తూ.. కేరింతలు, చప్పట్లతో ఈవెంట్‌ను మరింత హైప్ చేశారు.
ఇక DJ RAM, DJ TANAY తమ అదిరిపోయే మ్యూజిక్‌తో పార్టీ వాతావరణాన్ని మరింత ఎలివేట్ చేశారు. బీట్స్ మొదలైన దగ్గరి నుంచి ఈవెంట్ ముగిసే వరకు ప్రేక్షకుల ఎనర్జీ ఎక్కడా తగ్గలేదు.
సౌత్ ఇండియన్ మ్యూజిక్.. యువత జోష్.. ప్రేక్షకుల సందడి.. ఇవన్నీ కలిసొచ్చి “New York Times Square Takeover” ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్‌గా నిలిపాయి.



















