కనెక్టికట్‌లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు వేదికగా ‘TAC Ta dhim 11 – దసరా, దీపావళి సంబరాలు 2026’ నిర్వహించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ కనెక్టికట్ (TAC) భారీ ఏర్పాట్లు చేస్తోంది.
వెర్నన్‌లోని Rockville High School వేదికగా అక్టోబర్ 24న ఈ వేడుకలు జరగనున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు సాగే ఈ కార్యక్రమంలో అన్ని భాషల్లో డాన్స్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
డాన్స్‌లో ప్రతిభ చూపే విజేతలకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందించనున్నారు. కుటుంబ సమేతంగా పాల్గొనేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.
పాల్గొనేవారి కోసం Early Bird Registration సదుపాయం కూడా అందుబాటులో ఉంది. సభ్యులు, సభ్యులు కానివారికి వేర్వేరు రిజిస్ట్రేషన్ రుసుములు ఉండగా, ముందస్తు రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించారు.
కనెక్టికట్‌లో తెలుగు కళలు, సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటేలా ‘TAC Ta dhim 11’ను విజయవంతం చేయాలని TAC నిర్వాహకులు పిలుపునిచ్చారు.
Venue: Rockville High School, 70 Loveland Hill Rd, Vernon, Connecticut
Date: October 24, 2026
Time: 1:00 PM – 8:00 PM
Contact:
Usha Cherukuri: 732-874-0355
Likhitha Bandla: +1 (443) 838-8009
Email: TACTEVENT@YAHOO.COM
















