డల్లాస్‌లోని రాధాకృష్ణ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఆగస్టు 15న శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
వేడుకల్లో భాగంగా సుప్రభాతం, తోమాల సేవ, శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం, మంగళహారతి, సర్వదర్శనం, శ్రీ వెంకటేశ్వర అర్చన తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ గాయకుడు కలారత్న పరుపల్లి రంగనాథ్ ఆధ్వర్యంలో భక్తి కీర్తనలు కూడా ఉంటాయి.
డల్లాస్‌లోని 1450 N Watters Road, Allen, TX 75013లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. భక్తులందరికీ ఉచిత ప్రవేశం కల్పించడంతో పాటు మహా ప్రసాదం కూడా అందించనున్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాస స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.














