న్యూజెర్సీలో నవరాత్రి వేడుకలకు రంగం సిద్ధమైంది. గార్బా, డాండియా, లైవ్ మ్యూజిక్‌తో సందడిగా సాగే ‘నవరాత్రి మహోత్సవ్ 2026’లో ప్రముఖ గుజరాతీ గాయని కిన్జల్ దవే లైవ్‌గా సందడి చేయనున్నారు.

సెప్టెంబర్ 19న శనివారం రాత్రి 8 గంటలకు సెకాకస్‌లోని మీడోలాండ్స్ ఎక్స్‌పోజిషన్ సెంటర్ వేదికగా ఈ వేడుక జరగనుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో హాజరై గార్బా, డాండియా నృత్యాలతో నవరాత్రి సంబరాలను ఆస్వాదించవచ్చు.

లైవ్ గార్బా, డాండియా రాస్, మ్యూజిక్‌తో పాటు ఫుడ్, షాపింగ్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఈ కార్యక్రమంలో ఉండనున్నాయి. న్యూజెర్సీ తెలుగు, భారతీయ కమ్యూనిటీతో పాటు గుజరాతీ సంస్కృతి అభిమానులకు ఇది ప్రత్యేక వేడుకగా నిలవనుంది.

navarathri.jpg