డల్లాస్‌లోని మెక్‌కిన్నీలో కృష్ణ హెరిటేజ్ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణుడి దివ్య అవతరణను పురస్కరించుకుని సెప్టెంబర్ 4, 2026 శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
7082 County Rd 166, McKinney, TX 75071లోని కృష్ణ హెరిటేజ్ సెంటర్‌లో జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు, కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.
వేడుకల్లో భాగంగా జప ధ్యానం, కీర్తనలు, పిల్లల కోసం కిడ్స్ మేళా, లడ్డూ గోపాలుడికి అభిషేకం, అర్చన, 108 ప్రత్యేక సమర్పణలు, పల్లకి సేవ, ఝూలన్, గోపూజ, అర్ధరాత్రి హారతి వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అలాగే భక్తులందరికీ ఉచిత ప్రసాదం అందించనున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆటలు, వినోద కార్యక్రమాలతో కిడ్స్ మేళాను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
స్థల పరిమితుల దృష్ట్యా ముందస్తు RSVP తప్పనిసరి అని నిర్వాహకులు తెలిపారు. భక్తులు krishnaheritage.org/rsvp ద్వారా తమ స్లాట్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు.
“ప్రేమ, భక్తి, ఆనందంతో లిటిల్ కృష్ణుడిని స్వాగతిద్దాం” అంటూ కృష్ణ హెరిటేజ్ సెంటర్ కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది.










