ప్రపంచ ఐటీ సర్వీసెస్ రంగానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, సంస్థల అధినేతలు, ఇన్వెస్టర్లు, టెక్నాలజీ నిపుణులు ఒకే వేదికపైకి రానున్నారు. అమెరికాలోని చికాగోలో ITServe Synergy 2026 ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 29, 30 తేదీల్లో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు.
ITServe Synergy 2026లో 1,500 మందికి పైగా ఫౌండర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, ఇన్వెస్టర్లు పాల్గొననున్నారు. ITServeలోని 24 చాప్టర్లకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. రెండు రోజుల పాటు బిజినెస్ నెట్‌వర్కింగ్, వ్యూహాలు, పెట్టుబడులు, కొత్త వ్యాపార అవకాశాలు, టెక్నాలజీ భవిష్యత్తుపై కీలక చర్చలు జరగనున్నాయి.
AI నుంచి బిజినెస్ గ్రోత్ వరకు..
కృత్రిమ మేధ (AI) ఆధారంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, స్టాఫింగ్, ఐటీ సర్వీసెస్, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి అంశాలపై నిపుణులు చర్చించనున్నారు. పరిశ్రమ ప్రముఖులు, ఇన్వెస్టర్లు, పాలసీ మేకర్ల నేతృత్వంలో 7 పవర్ సెషన్స్ నిర్వహించనున్నారు.
ప్రత్యేక నెట్‌వర్కింగ్.. బిజినెస్ అవకాశాలు
ఈ సదస్సులో CXOలు, ఫౌండర్లు, ఇన్వెస్టర్లతో ప్రత్యేక 1:1 నెట్‌వర్కింగ్ అవకాశాలు కల్పించనున్నారు. అంతేకాకుండా సంస్థలకు తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు మెయిన్ స్టేజ్, డీల్‌రూమ్స్, లాంజ్‌లు, డిజిటల్ మీడియా వంటి వేదికలు అందుబాటులో ఉంటాయి.
ఎంటర్‌ప్రైజ్ కొనుగోలుదారులతో నేరుగా ఐటీ భాగస్వామ్య అవకాశాలు కల్పించే ProcureConnect కూడా ఈ కార్యక్రమంలో కీలక ఆకర్షణగా నిలవనుంది.
రెండు ప్రత్యేక లీడర్‌షిప్ ట్రాక్స్
వ్యాపార విస్తరణ, నాయకత్వం, వ్యూహాత్మక అభివృద్ధిపై దృష్టి సారిస్తూ Elite Leaders Lab మరియు Elite Builders Lab పేరుతో రెండు ప్రీమియం లెర్నింగ్ ట్రాక్స్ నిర్వహించనున్నారు. ప్రపంచ స్థాయి విజయవంతమైన నాయకులు స్పీకర్లు, ప్యానలిస్టులు, మెంటర్లుగా పాల్గొననున్నారు.
ఎక్కడ.. ఎప్పుడు?
వేదిక: Renaissance Schaumburg Convention Center
చిరునామా: 1551 N Thoreau Dr, Schaumburg, IL 60173
తేదీలు: అక్టోబర్ 29–30, 2026
సమీప విమానాశ్రయం: Chicago O’Hare International Airport (ORD) – వేదిక నుంచి సుమారు 15 నిమిషాల దూరం
ఐటీ సర్వీసెస్ రంగంలో కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులు, టెక్నాలజీ ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణకు వేదికగా నిలవనున్న ITServe Synergy 2026పై పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.













