భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని మిషిగన్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ – మిషిగన్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15న శనివారం నోవిలోని Vibe Credit Union Showplaceలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. భారతీయ సమాజ సభ్యులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, స్వేచ్ఛా స్ఫూర్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ – మిషిగన్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీధర్ పటేల్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కమిటీలో అడ్వైజరీగా వినోద్ కుకునూర్, వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్ బండి, జనరల్ సెక్రటరీగా వెంకట్ బొల్లవరం, జాయింట్ సెక్రటరీగా యోగేష్ కొల్లు, ట్రెజరర్‌గా వెంకట్ నాటాల, జాయింట్ ట్రెజరర్‌గా అనిల్ కురపాటి ఉన్నారు.
అలాగే పబ్లిసిటీ అండ్ మీడియా బాధ్యతలను దేవానంద్ అలే, హాస్పిటాలిటీ అండ్ డెకరేషన్ బాధ్యతలను డా. పద్మ పటేల్ నిర్వహిస్తున్నారు. మెంబర్‌షిప్ కోఆర్డినేటర్లుగా రవి బొమ్మారెడ్డి, శాంతన్ రెడ్డి కంచర్ల, యోగేష్ దురైసామి రాజమణి, రమేష్ మాండే, రాజశేఖర్ పెరికేటి, రోహిత్ కొండల్, శరత్ మందాడి కొనసాగుతున్నారు.
విమెన్స్ ఫోరం బాధ్యతల్లో అర్హ ఇనామ్‌దార్, మార్కెటింగ్ కోఆర్డినేటర్‌గా శ్రీలత పెరి, కమిటీ మెంబర్‌గా రాకేష్ వర్మ ఉన్నారు.
“Let’s Celebrate Freedom, Unity & Heritage” అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.










