అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌ మూడు రోజుల పాటు భారతీయ సంస్కృతి, సంగీతం, షాపింగ్ సందడితో కళకళలాడనుంది. యుక్త ఈవెంట్స్ ఆధ్వర్యంలో, సలేహ సమర్పణలో ‘ఇండియా మేళా’ను ఆగస్టు 14, 15, 16 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు.

ఆగస్టు 14న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, ఆగస్టు 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, ఆగస్టు 16న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేళా కొనసాగనుంది. ఈ సందర్భంగా షాపింగ్, సంగీతం, నృత్యాలు, విభిన్న భారతీయ వంటకాలతో సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నారు. ఈ మేళాలో 100కు పైగా ప్రముఖ బ్రాండ్లు పాల్గొంటున్నాయి.

మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఆగస్టు 14న ‘భజన్ జమ్మింగ్’ పేరుతో సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆగస్టు 15న లైవ్ కాన్సర్ట్‌తో పాటు స్థానిక ప్రతిభావంతుల ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి.

ఆగస్టు 16న గ్రాండ్ ఫినాలేలో భాగంగా దిగ్గజ గాయకులు ఆశా జీ, కిషోర్ దా, రఫీ సాహబ్‌లకు ప్రత్యేక నివాళిగా ‘జుగల్బందీ’ సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో స్వాతి క్రిస్తమ్ ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

న్యూయార్క్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ పార్టనర్ తీవన్ తైవకుమా ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు. ఆశా-జ్యోతి సంస్థ ఈ వేడుకలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఇండియా మేళాకు కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

India Mela.jpg