అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం, భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జార్జియాలోని కమ్మింగ్ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఆగస్టు 15న జరిగే ఈ కార్యక్రమంలో గ్రాండ్ పరేడ్, రుచికరమైన ఆహారం, లైవ్ మ్యూజిక్, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనిటీ సందేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ చారిత్రాత్మక వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు. సునీల్ సవిల్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం అమెరికా, భారతదేశాల స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేలా నిర్వహించనున్నారు.










