అమెరికాలోని అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15న జరగనున్న ఈ టోర్నమెంట్‌లో ఏకంగా 24 జట్లు బరిలోకి దిగనున్నాయి.
వేగవంతమైన ర్యాలీలు, అదిరిపోయే సర్వీసులు, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో టోర్నమెంట్ సందడిగా సాగనుంది. విజయం కోసం ఆటగాళ్లు హోరాహోరీగా తలపడనుండగా.. తమ జట్లను ప్రోత్సహించేందుకు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
24 జట్లు.. ఒకే ఛాంపియన్‌షిప్.. అంతులేని ఉత్కంఠ! అంటూ ATA నిర్వాహకులు టోర్నమెంట్‌పై ఆసక్తిని పెంచుతున్నారు. పోటీతో పాటు స్నేహం, టీమ్‌వర్క్, క్రీడాస్ఫూర్తిని చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
టోర్నమెంట్ విజయవంతం కావడానికి కృషి చేస్తున్న ATA క్రీడాకారులు, వాలంటీర్లు, నిర్వాహకులు, స్పాన్సర్లు, మద్దతుదారులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్టు ఛాంపియన్‌గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకోనుంది.











