ఫ్యాషన్, జ్యువెలరీ, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను ఒకే వేదికపై అందించేలా ‘Chai & Chic – Where Fashion Meets High Tea’ పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఆగస్టు 29న శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మోన్రో టౌన్‌షిప్‌లోని DoubleTree by Hilton, Cranburyలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ ఎగ్జిబిషన్‌లో క్లాతింగ్, జ్యువెలరీ, లైఫ్‌స్టైల్ బ్రాండ్స్తో ప్రత్యేక షాపింగ్ అనుభవాన్ని కల్పించనున్నారు. అలాగే హై టీ ఎక్స్‌పీరియన్స్, లైవ్ మ్యూజిక్, జామింగ్ సెషన్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఆయనతో కలిసి సంగీత ప్రియులు జామింగ్ సెషన్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

ప్రవేశం ఉచితంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చని నిర్వాహకులు తెలిపారు.

WhatsApp Image 2026-08-27 at 10.08.27 PM.jpeg