టెక్సాస్‌లోని ఆబ్రేలో బాలీవుడ్, టాలీవుడ్ పాటలతో అదిరిపోయే Live Musical Nightకు రంగం సిద్ధమైంది. De Vibe Indian Restobar వేదికగా సెప్టెంబర్ 19, శనివారం రాత్రి ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Meherతో పాటు లైవ్ సింగర్స్, మ్యూజిషియన్స్ పాల్గొని బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ఫేవరెట్ హిట్స్‌ను లైవ్‌గా ఆలపించనున్నారు. సంగీతంతో పాటు రుచికరమైన ఫుడ్, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో శనివారం రాత్రిని మరింత స్పెషల్‌గా మార్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాత్రి 8 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌కు ప్రవేశం పూర్తిగా ఉచితం. అయితే సీటింగ్ పరిమితం కావడంతో First Come, First Served విధానంలో సీట్లు కేటాయించనున్నారు. ఈ కార్యక్రమాన్ని Ambu Aventa Inc, De Vibe Indian Restobar సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.

devibe.jpg