భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో వినాయక చవితికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి వినాయక చవితి సందర్భంగా.. వినాయకుడిని పిల్లలే తమ చేతులతో తయారు చేసుకుని, తమ ఇళ్లలో పూజించాలనే వినూత్న ఆలోచనతో ATA NJ టీమ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

“Making Eco-Friendly Ganesha” పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పిల్లలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవడంతో పాటు, సాయిదత్త పీఠంలో నిర్వహించిన కార్యక్రమానికి తమ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిన్నారులు తమ చిన్నచిన్న చేతులతో మట్టి గణపయ్యలను స్వయంగా తయారు చేశారు. పర్యావరణానికి హాని కలిగించని విధంగా వినాయక విగ్రహాలను తయారు చేయడం ద్వారా.. సంప్రదాయాలను కొనసాగిస్తూనే ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని ATA NJ టీమ్ అందించింది.

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, భక్తుల మొర ఆలకించి ఆశీర్వదించే బొజ్జ గణపయ్యను తమ చేతులతో తయారు చేసుకోవడం పిల్లలకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. తాము తయారు చేసిన గణపయ్యలను ఈసారి తమ ఇళ్లలో పూజించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు వినాయక చవితి ప్రాశస్త్యాన్ని తెలియజేయడంతో పాటు.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే అవకాశం లభించిందని తల్లిదండ్రులు తెలిపారు. పిల్లలతో స్వయంగా ఎకో ఫ్రెండ్లీ గణపయ్యలను తయారు చేయించిన ATA NJ టీమ్‌ను వారు అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ నిర్వహించాలని ఆకాంక్షించారు.

కాగా, తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడం పట్ల ATA NJ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. పిల్లలు, తల్లిదండ్రులు చూపించిన ఉత్సాహం తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందని తెలిపింది.

అందరి సహకారం, ప్రోత్సాహంతో భవిష్యత్తులోనూ మరిన్ని సామాజిక, సాంస్కృతిక, పర్యావరణహిత కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు సమాజానికి మరింత చేరువగా పనిచేస్తామని ATA బోర్డు సభ్యులు, కోఆర్డినేటర్లు, వాలంటీర్లు తెలిపారు.  ఈ సందర్భంగా ATA NJ టీమ్, NJ Youth Team, Women’s Team, Regional Coordinators, Volunteersతో పాటు కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

సంప్రదాయాన్ని కాపాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. భవిష్యత్ తరాలకు మంచి సందేశాన్ని అందించిన ATA NJ “Eco-Friendly Ganesha” కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది.