న్యూజెర్సీలోని లాంగ్ వ్యాలీలో ‘అన్నా సూత్ర – ది థ్రెడ్ ఆఫ్ వెల్‌బీయింగ్: సాయిల్ టు హెల్త్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. సేవ్ ఇండియన్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో ఆగస్టు 29, 2026న ఎథోస్ ఫార్మ్ టు హెల్త్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో వర్కింగ్ ఫార్మ్‌ను సందర్శించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, ప్రాచీన భారతీయ ఆరోగ్య విధానాలపై నిపుణుల ప్రసంగాలతో పాటు యోగా, గైడెడ్ మెడిటేషన్, సౌండ్ హీలింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అలాగే ఇండియన్ హోల్‌ఫుడ్, ప్లాంట్‌-బేస్డ్ లంచ్‌ను కూడా అందించనున్నారు. సేవ్ ఇండియన్ ఫార్మర్స్ చేపడుతున్న ప్రాజెక్టులు, రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలపై పాల్గొనేవారికి అవగాహన కల్పించనున్నారు.

ఈ కార్యక్రమానికి పెద్దలకు 10 డాలర్లను సూచిత విరాళంగా నిర్ణయించారు. పిల్లలకు ఉచిత ప్రవేశం ఉంటుంది. సీట్లు పరిమితంగా ఉండటంతో ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని నిర్వాహకులు తెలిపారు.

WhatsApp Image 2026-08-13 at 9.21.36 AM.jpeg