తమిళనాడులో ఓ నర్సు హత్య కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి! తేని జిల్లా ఆండిపట్టికి చెందిన 48 ఏళ్ల నర్సు సెల్వి.. 2021 నవంబర్‌లో తన ఇంట్లో హత్యకు గురైంది. దాదాపు ఐదేళ్ల దర్యాప్తు తర్వాత ఈ కేసులో కీలక ఆధారాలు బయటపడ్డాయి.

సెల్వి ఒంటరిగా నివసిస్తున్న ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు భారీ సంఖ్యలో కండోమ్‌లు లభించాయి. ఆమె ఫోన్ కాంటాక్ట్స్, కాల్ డేటాను పరిశీలించగా వందలాది మంది పురుషుల నంబర్లు ఉన్నట్లు గుర్తించారు.

దర్యాప్తు చివరికి కంబం ప్రభుత్వాస్పత్రిలో పనిచేసిన రామచంద్రప్రభుపై అనుమానం వెళ్లింది. హత్య జరిగిన రోజు అతడు సెల్వి ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీ, ఆమె బంగారు గొలుసును తాకట్టు పెట్టిన ఆధారాలు, ఘటనా స్థలంలో లభించిన పాదముద్రలు పోలీసులకు కీలకంగా మారాయి.

విచారణకు సమన్లు అందుకున్న మరుసటి రోజే రామచంద్రప్రభు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్వికి లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన డబ్బు విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు నిర్ధారించారు.

దాదాపు ఐదేళ్ల తర్వాత.. సంచలనం సృష్టించిన ఈ నర్సు హత్య కేసు మిస్టరీకి తెరపడింది!