బెంగళూరులో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న టన్నెల్‌ రోడ్డు ప్రాజెక్టులపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.40 వేల కోట్ల “నిధి” కోసమే ప్రభుత్వం టన్నెల్‌ ప్రాజెక్టులపై కన్నేసిందని విమర్శించారు. ప్రాజెక్టుల కోసం పార్కులు, చెరువుల చట్టాలను సవరించారని ఆరోపించారు. ముఖ్యంగా సరస్సుల బఫర్‌ జోన్‌ను 30 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించే సవరణతో చెరువులు, భూగర్భ జలాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సవరణలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తానని తేజస్వి సూర్య స్పష్టం చేశారు. సీఎం డీకే శివకుమార్‌ స్పందిస్తూ.. ఢిల్లీ, మహారాష్ట్రలోని టన్నెల్‌ రోడ్డు ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలని అన్నారు.