దేశవ్యాప్తంగా అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న CUET-UG 2026 పరీక్ష శనివారం కొన్ని కేంద్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది.
పరీక్ష నిర్వహణ భాగస్వామి టీసీఎస్ (TCS) సాంకేతిక లోపం కారణంగా కొన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంలో జాప్యం జరిగినట్లు ఎన్టీఏ తెలిపింది. అయితే సమస్యను వెంటనే పరిష్కరించామని, విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి అదనపు సమయం కల్పిస్తున్నామని పేర్కొంది.
మధ్యాహ్న సెషన్‌కు సంబంధించిన సమయాల్లో మార్పులు చేశారు. అభ్యర్థుల రిపోర్టింగ్, ప్రవేశం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రారంభమవుతుండగా, పరీక్ష సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉదయం సెషన్ అభ్యర్థులకు కూడా పూర్తి పరీక్ష సమయం ఇచ్చినట్లు తెలిపారు.
ఈ అసౌకర్యానికి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎన్టీఏ క్షమాపణలు తెలిపింది. సహాయం కోసం +91-11-40759000 హెల్ప్‌లైన్ నంబర్, అలాగే cuet-ug@nta.ac.in ఈమెయిల్‌ను సంప్రదించాలని సూచించింది.













