
1630 వార్తలు

టెక్నాలజీ అనేది అభివృద్ధికి తోడ్పడాలి కానీ అలవాటుగా మారకూడదు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారికి డిజిటల్ పరికరాల కంటే మైదానాల్లో ఆటలు, పుస్తకాలతో స్నేహాన్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. స్క్రీన్ టైమ్ సమస్య తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎదురవుతోందని కామత్ వివరించారు. తన కుమారుడు కియాన్ చదువుతున్న స్కూల్లో డిజిటల్ పరికరాలకు అనుమతి లేదని, ఇంట్లో కూడా కేవలం 30 నిమిషాలు మాత్రమే స్క్రీన్ టైమ్ ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ, పిల్లలు షార్ట్ వీడియోలు, రీల్స్‌కు ఎంత త్వరగా ఆకర్షితులవుతున్నారో చూసి తాను ఆశ్చర్యపోతున్నానని వెల్లడించారు.

మారుతున్న వాతావరణంతో వ్యవసాయంలో సవాళ్లు నిరంతరం పెరుగుతున్నాయి. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు తెగుళ్ల బెడద ఒక పెద్ద సమస్యగా మారుతోంది. పంటలకు తెగుళ్లు సోకిన తర్వాత, వాటిని ఎదుర్కోవడం రైతులకు చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో కొందరు రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి సాంప్రదాయ, దేశీయ పద్ధతులను అవలంబిస్తున్నారు. రసాయన పురుగుమందులు సులభంగా అందుబాటులో లేని పూర్వ కాలంలో, తమ పూర్వీకులు కీటకాలను తరిమికొట్టడానికి బొప్పాయి ఆకులను ఉపయోగించేవారని చెబుతున్నారు. ఈ సాంప్రదాయ పద్ధతి నేటికీ అంతే ప్రభావవంతంగా నిరూపించబడుతోంది. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇప్పటి నుంచి మే నెల చివరి వరకు కొన్ని రాశులకు ఏకంగా అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగే విశేషం. ప్రస్తుతం అటువంటి అనుకూల పరిస్థితి ఆరు రాశులకు ఏర్పడబోతోంది. ఈ నెల 20న శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో ప్రవేశించడంతో కొన్ని రాశులకు అయిదు గ్రహాల అనుకూలత ఏర్పడుతోంది. సుమారు 40 రోజుల పాటు గురు, శుక్ర, బుధ, శని, కుజ, రాహువులు అనుకూలంగా ఉండడం వల్ల వృషభం. మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారు విజయాలు, సాఫల్యాలతో జీవితాన్ని గడపడం జరుగుతుంది.

అనకాపల్లి జిల్లా పారిశ్రామిక రంగంలో మరోసారి వార్తల్లో నిలవనుంది. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రాంతం, ఇప్పుడు మరో పెద్ద క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌తో చర్చలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీపై దృష్టి పెరుగుతున్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.

సాధారణంగా వెండితెరపై అలరించే తారల లైఫ్ అంతా సవ్యంగా సాగవు. గ్లామర్ ప్రపంచంలో తమ నటనతో కట్టిపడేసే ముద్దుగుమ్మల జీవితాలు ఎన్నో ఒడిదుడుకులతో నిండి ఉంది. ఎన్నో పోరాటాల తర్వాత ఈ స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ ఈ సినీ ప్రయాణంలో ఆమె సంబంధాలు తెగిపోవడం, పెళ్లిళ్లు, విడాకులు, ఇలా అన్నింటినీ చవిచూసింది.

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండేసి విజయాలతో ఈ జట్లు ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే, మిగిలిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించడం తప్పనిసరి. ముఖ్యంగా CSK గాయాలతో సతమతమవుతుండగా, ముంబై బౌలింగ్ మెరుగుపడాలి.

DSP Ravi Bishnoi : రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల క్రీడా కోటాలో డీఎస్పీగా నియమించింది. ఈ హోదా దక్కిన తర్వాత తొలిసారి తన స్నేహితుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు ఆకాష్ సింగ్‌ను బిష్ణోయ్ కలిశాడు.

గత నెలలోనే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 1990ల నాటి హీరో అబ్బాస్ గురించి. చాలా ఏళ్ల తర్వాత ఆయన ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు.

Saturn in Pisces 2026: జ్యోతిష్యంలో న్యాయం, కర్మలకు ప్రతీక అయిన శని గ్రహం తన ప్రభావాన్ని మళ్లీ బలపరుచుకోబోతోంది. 2026 మార్చి 13న మీనరాశిలోకి ప్రవేశించిన శని, 2026 ఏప్రిల్ 22 ఉదయం 4:49కి అస్తమయం ముగిసి తిరిగి ఉదయిస్తుంది. ఈ మార్పుతో శని ప్రభావం పెరిగి, అన్ని రాశులపై ప్రభావం చూపినా కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శుభఫలితాలు కలిగే అవకాశం ఉంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rinku Singh : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్నప్పటికీ, తన జట్టు తర్వాతి మ్యాచ్ లక్నోలో జరగాల్సి ఉండటంతో రింకూ సింగ్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. ఏప్రిల్ 21న తన కాబోయే భార్య ప్రియా సరోజ్‌తో కలిసి వారణాసి చేరుకున్నాడు. వీరిద్దరూ కలిసి కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రోజు మనం ఒక సీరియస్ విషయం గురించి మాట్లాడుకుందాం. సిగరెట్ ప్యాకెట్ మీద 'పొగాకు ప్రాణాంతకం' అని రాసి ఉంటుంది. అది చూసి కూడా లైట్ తీసుకుంటాం. 'ఏదో ఒక రోజు చావక తప్పదు కదా' అని జోకులు వేసుకుంటాం. కానీ మీకు తెలుసా? పొగాకు కేవలం మీ ఊపిరితిత్తులను మాత్రమే కాదు.. మీ ఇంటి ఆర్థిక పునాదులను, మీ పిల్లల భవిష్యత్తును, మీ గౌరవప్రదమైన జీవితాన్ని కూడా సర్వనాశనం చేస్తోంది.

సమ్మర్ కాలిగా ఉండే బదులు సొంతూరికి వెళ్లి పొలం పనులు చేసుకోవాలనుకునే వారికి ఇదో అదరిపోయే ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వేసవి కాలంలో రైతులు తక్కువ వ్యవధిలో పండే కూరగాయలను సాగు చేయడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా దోసకాయ, కొత్తిమీర వంటి పంటలు కేవలం 40 రోజుల్లోనే చేతికి వస్తాయి. సమ్మర్లో మార్కెట్లో వీటికి డిమాండ్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఈ పంటలను ఎలా పెంచాలో తెలుసుకుందాం.

ప్రస్తుతం ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు బోల్డ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ.

IPL 2026 : లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరగబోయే 32వ మ్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు ఇద్దరు యువ సంచలనాల మీద ఉన్నాయి. ఒకరు రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ల వీరుడు వైభవ్ సూర్యవంశీ, మరొకరు లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్ గన్ ప్రిన్స్ యాదవ్.

క్రికెట్ అంటే మన దేశంలో ఒక వ్యసనం. ఐపీఎల్ అంటే ఒక పండగ. కానీ, సోమవారం నాడు ఉప్పల్ స్టేడియంలో జరిగిన దృశ్యాలు చూస్తే.. ఇది క్రికెట్ మ్యాచా లేక మరేదైనా క్షుద్ర పూజల వేదికా అనిపించక మానదు. సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆనందం ఒకవైపు ఉంటే.. గ్యాలరీలో ఒక అభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిమ్మకాయలు, మంత్రాలు, వికెట్లు.. ఇంతకీ ఆరోజు అసలు ఏం జరిగింది? నిజంగానే ఐపీఎల్ లో చేతబడి జరుగుతోందా? లలిత్ మోదీ చేసిన ఆ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం.

Steve Smith: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్లో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. యువ పేసర్ బౌలింగ్‌లో వరుస ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ పాత స్మిత్‌ను గుర్తుచేశాడు. మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ శైలిని ప్రదర్శించి అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ముల్తాన్ సుల్తాన్స్ ఘనవిజయం సాధించింది.

వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు రావడం, కాంతి తగ్గడం సహజం. అయితే, 40 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల యువతీ యువకుల్లా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో తీవ్రమైన ఎండ, కాలుష్యం వల్ల చర్మం త్వరగా తన సహజ సిద్ధమైన మెరుపును కోల్పోయి, నల్లబడటం పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల ముఖం అలసటగా, వయసు పైబడినట్లు కనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, శారీరక సమతుల్యత సరైన పోషణ ద్వారా చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మనం వండే ప్రతి వంటకానికి కొత్తిమీర ప్రత్యేకమైన రుచిని, సువాసనను అందిస్తుంది. అయితే మార్కెట్ నుండి తెచ్చిన కొత్తిమీర కేవలం రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం మనందరికీ ఎదురయ్యే పెద్ద సమస్య. దీనికి పరిష్కారంగా, ఎటువంటి రసాయనాలు లేకుండా తాజాగా ఉండే కొత్తిమీరను మీ ఇంటి బాల్కనీలోనే కేవలం 10 రోజుల్లో పెంచుకోవచ్చు. కొద్దిపాటి శ్రమ సరైన పద్ధతులతో మీ చేతులతో పెంచిన పచ్చని కొత్తిమీరను వాడుకోవడం వల్ల ఆహార రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

వేసవి కాలంలో వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుంది. వడదెబ్బ తగిలే ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది.. వాటిని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. తీవ్రమైన తలనొప్పి, అలసట, చెమటలో మార్పులు వంటి లక్షణాలను విస్మరించకూడదు. ఈ సంకేతాలను సకాలంలో అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బను సమర్థవంతంగా నివారించవచ్చు.

తెలుగు కళాకారుడు అద్భుత కళాఖండానికి జీవం పోశాడు. పెన్సిల్ మొనతో ఇంటర్ లాకింగ్ చైన్ (గొలుసు) రూపొందించి ఔరా అనిపించాడు. ఇది చూడటానికి కొత్తగా ఉంది. దీనిని ఒకసారి చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇది నిజామా ? లేక బొమ్మనా అని.. అంత అద్భుతంగా చేశాడు. ఇప్పుడు అందరి చూపు ఆ పెన్సిల్ పైనే ఉంది.

ఐపీఎల్ 2026 సీజన్లో ఎన్నో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, పాతవి తుడిచిపెట్టుకుపోతున్నాయి. కానీ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న ఒక అవాంఛిత రికార్డు మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీకి, తన కెరీర్లోనే అత్యంత స్లో సెంచరీ ఒక మచ్చలా మిగిలిపోయింది. ఆ రికార్డు విశేషాలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

కొంతమంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మరికొంతమంది మాత్రం గ్లామర్ కె ఎక్కువ ప్రదాన్యత ఇస్తుంటారు. ఇక చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతున్నారు. ఓ హీరోయిన్ రాత్రంతా స్పెషల్ సాంగ్ షూట్ చేసి తెల్లవారే పెళ్లి చేసుకుంది.

ఏప్రిల్ నెల ముగిసిపోయి మే నెల వచ్చేస్తోంది. అయితే మే నెలలో నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టనుంది. వారు ఏం చేసినా కలిసి రావడమే కాకుండా ముట్టింది ముత్యం, పట్టింది బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.