Chitra Pournami Tiruvannamalai Girivalam: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో చిత్ర పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరి ప్రదక్షిణ (గిరివలయం) చేయడానికి శుభ ముహూర్తాన్ని ప్రకటించారు. అదే సమయంలో, ఆలయ, జిల్లా యంత్రాంగం భక్తులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తూ, భద్రతా ఏర్పాట్లను చేస్తోంది. ఈరోజున పెద్ద ఎత్తున భక్తులు గిరిప్రదక్షిణ చేసే అవకాశం ఉంది.