పిల్లలు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా, బాలల భద్రత మరియు డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలను తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖలు సంయుక్తంగా నిర్వహించాయి.
జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆటల పరికరాలు, వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు.
బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం అందరినీ ఆలోచింపజేసింది.
అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు, వారికి అందుతున్న పోషకాహారం గురించి కలెక్టర్ ఆరా తీశారు.
ఈ సందర్భంగా ముఖ్యమైన హెల్ప్‌లైన్ నంబర్లు తెలియజేశారు:
షీ టీమ్: 87126 56425
చైల్డ్ హెల్ప్‌లైన్: 1098
టెలీ మానస్: 14416










