ఒకప్పుడు ఆమె కుర్రాళ్ల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ. ఆమె చేసింది చిన్న చిన్న సినిమాలే.. కానీ తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ హీరోయిన్.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత చాలా కాలంపాటు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆమె మరెవరో కాదు రేఖ వేదవ్యాస్.

rekha veda.jpg

తెలుగులో ఆనందంతో పాటు ‘దొంగోడు’, ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ వంటి వరుస విజయాలను అందుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా సుమారు 30కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.

rekha1.jpg

అయితే, 2014 తర్వాత ఆమె వెండితెరకు క్రమంగా దూరమయ్యారు. చాల కాలం పాటు మీడియా కంటికి చిక్కని రేఖ, ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించడం అభిమానులను ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.