నేపాల్‌లో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్న వేళ.. బాధితులకు సంఘీభావంగా ప్రముఖ ఇసుక కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేక ఇసుక శిల్పాన్ని రూపొందించారు.
ఒడిశాలోని పూరీ బీచ్‌పై 20 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తుతో ఈ శిల్పాన్ని రూపొందించారు. దానిపై “Prayers for Nepal” అంటూ సందేశాన్ని ఉంచారు.
వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. నేపాల్ ప్రజల భద్రత, క్షేమం కోసం ప్రార్థించారు.కష్టకాలంలో మానవత్వం ఒక్కటిగా నిలవాలి అంటూ సందేశమిచ్చారు.
విద్యార్థుల సహకారంతో రూపొందించిన ఈ శిల్పం..సరిహద్దులు వేరైనా మానవత్వం ఒక్కటేనని చాటుతోంది.









