24164 articles

వావ్రే(బెల్జియం): పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో జర్మనీ విజేతగా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో జర్మనీ 10 గోల్ తేడాతో స్పెయిన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన తుది సమరంలో జర్మనీ అతి కష్టం మీద విజయం సాధించింది. జర్మనీకి ఇది నాలుగో ప్రపంచ కప్ ట్రోఫీ కావడం విశేషం. ఇక అర్జెంటీనా టీమ్ కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఆదివారం వావ్రే వేదికగా మూడో స్థానం కోసం నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో అర్జెంటీనా 21 గోల్స్ తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో అర్జెంటీనా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ప్రారంభం నుంచే ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరూ దాడులు చేస్తూ గోల్స్ కోసం ప్రయత్నించాయి. కానీ ప్రథమార్ధంలో రెండు జట్లకు ఒక్క గోల్ కూడా లభించలేదు. అయితే రెండో హాఫ్ ఆరంభంలోనే అర్జెంటీనా బోణీ కొట్టింది. టొమాస్ డొమెనె 41వ నిమిషంలో జట్టుకు తొలి గోల్ సాధించి పెట్టాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ ఎదురుదాడికి దిగింది. ప్రత్యర్థి జట్టుపై వరుస దాడులు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే క్రమంలో 49వ నిమిషంలో ఫ్లోరిస











రండి మిత్రులారా రండి, జ్ఞాపకాల్ని పోగేసుకుందాం రండి ఎక్కడెక్కడో పోగొట్టుకున్న జ్ఞాపకాల్ని తిరిగి వెతికి పట్టుకుని ఒకచోట కుప్ప పోసుకుందాం రండి ఒకానొక చెట్టుకు తేనెపట్టులా ఒదిగిన వాళ్లం ఎన్నెన్నో మధుర జ్ఞాపకాల్ని తేనెలా కూడబెట్టుకున్నవాళ్లం ఒక్కసారి ఆ తేనెతుట్టెను కదిలించుకుందాం రండి ఎన్నెన్నో పూలవనాల్ని గాలించిన వాళ్లం ఇంకెన్నో ముళ్ల వనాల్ని ఛేదించిన వాళ్లం, ఆశయాల కోసమో ఆశల కోసమో బతుకును సంకనేసుకుని బయలుదేరిన వాళ్లం ఎక్కడెక్కడో మన నుండి మనం తప్పిపోయిన వాళ్లం మనల్ని మనం మరోసారి దొరకబట్టుకుందాం రండి రండి మిత్రులారా రండి జ్ఞాపకాల్ని పోగేసుకుందాం రండి ఒక చెట్టును గూడుగా చేసుకుని గడిపిన వాళ్లం వలస పక్షులమై తలో దిక్కుకి ఎగిరిపోయిన వాళ్లం ఎవరి స్వార్థ చింతనలో వాళ్లం యంత్రాల్లా మిగిలిపోయుంటాం మనుషులుగా ఉన్నామో లేదో ఒక్కసారి మనల్ని మనం గిల్లి చూసుకుందాం రండి బతుకు బాటలో నదీపాయల్లా చీలిపోయిన వాళ్లం జీవన పోరాటాల చలి గాలికి వణికిపోతున్న వాళ్లం అప్పుడప్పుడైనా జ్ఞాపకాల చిదుగుల్ని పోగేసుకుని మనల్ని మనం వెచ్చబరుచుకుందాం రండి మనం చేసిన అల్లర్లు, ప్రదర్శించుకున్న ప్రే

తెలుగు కవిత్వ చరిత్రలో ఆధునిక దశ ఒక కీలక మలుపు. అది కేవలం ఛందస్సుల మార్పు కాదు. పదాల అలంకరణ కాదు. మనిషి జీవితాన్ని, అతని బాధలను, కలలను, తిరుగుబాటును కేంద్రంగా పెట్టుకున్న ఒక కొత్త చైతన్యం. ఈ చైతన్యాన్నే మనం అభ్యుదయ దృక్కోణం అంటాం. సమాజాన్ని మార్చాలనే తపన, అణచివేతపై నిరసన, శ్రమకు గౌరవం, మానవ సమానత్వం ఇవి అభ్యుదయ కవిత్వానికి మూల స్తంభాలు. పూర్వ కాల కవిత్వం ఎక్కువగా రాజులు, దేవతలు, పురాణాల చుట్టూ తిరిగింది. ఆధునిక, అభ్యుదయ కవిత్వం వీధిలో నడిచే మనిషిని చూసింది. ఆకలితో అలమటించే రైతును, కర్మాగారంలో చెమట కార్చే కార్మికుణ్ని, పేదరికంతో చదువు దూరమైన బాలుడ్ని, కుల, లింగ వివక్షతో నలిగిన స్త్రీని తన కవితలో నిలిపింది. కవిత ఇక రాజ ఆస్థానాల్లో వినిపించాల్సిన కావ్యం కాదు. అది ప్రజల గుండెల్లో మోగాల్సిన నినాదం అయింది.ఈ అభ్యుదయ ప్రవాహానికి బలమైన పునాది వేసినవారిలో శ్రీశ్రీ అగ్రస్థానంలో నిలుస్తారు. ఆయన మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని పూర్తిగా మలిచిన గ్రంథం.పాదాలే నా దేవాలయంపేదలే నా దేవుళ్లు అనే పంక్తుల్లోనే ఆయన దృక్కోణం స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు ఆలయంలో కాదు, శ్రమించే మనిషిలో ఉన్నాడన్న భావన ఇది. వ్య

గుండె నిండా ఉప్పునిముడ్చుకొని అడుగు పొరల్లో నిప్పును ఉంచుకొని నీటి అలల్ని ఎగరేసే సముద్రం భూమిని కోస్తుందని వానల వరదల తనలో కలుపుకుని నదికి పారే గుణం ఇచ్చేది దారి చూపేది భూమేనని, ఎగుడు దిగుడు స్వభావాల్లోంచి ఉన్నతత్వాన్ని ఆస్వాదిస్తూ మానవుల్లో ఉత్తములు ఉంటారని, దీపం ఎప్పుడూ వెలుగు పంచుతుందని పువ్వులెన్నో తావినిస్తాయని, పువ్వుల కింద ముళ్ళు ఉన్నట్లు మనుషుల లోపల వానరులు లోలోపల రాక్షసులు ఉండొచ్చని నిప్పు ఉప్పు కలిసి ఉన్నా కదపకుంటే ప్రశాంతమేనని విడిచిన బాణం గుచ్చుకుని తెలుసుకోలేని తెలివి తొడుగుతో మరిగేది మర యంత్రాలని తెలియని అమాయకత విశ్వ రహస్యంలోని మనిషిదేనని ప్రపంచాన్ని ప్రయోగశాలగా చేసి ప్రళయాలనే సృష్టిస్తున్నారని నిలబడిన కొమ్మ నరుక్కుంటూ చెట్టుని నిందిస్తున్నారని ఇప్పుడు బాగా అర్థమైన నగ్నసత్యం- కొండపల్లి నిహారిణి

చెట్టు మీద ఒక పిట్ట రివ్వున ఎగిరి వెళ్లిన వైపు చూపుల గాలం వేశాను ఓ రెండు కళ్ళు, ఓ రెండు చేతులు ఒక గాయాన్ని మోస్తూ తిరిగి వస్తున్న శశిరాల్ని రాలుస్తున్నవి దాటిపోలేని దుఃఖం, భూ వనరులనూమానవ వనరులనూ ఏకం చేసిన చిచ్చుకు తెర తీసి, విరిసిన మానవత్వానికి తెరవేసి విసిరిన వలలో రెండు శరీరాలతో ప్రదర్శన చేయించడాన్ని చూసి రక్తాశ్రువులు ప్రవహించినవి నిచ్చెన మెట్ల సమాజం నిర్మించలేదేఏ నూతనోత్తేజ శిలా తోరణం శాంతి అగ్ని కీలలపై ఒంటరి నడక అక్కడ బూడిద కుప్పలు గత జీవన దృశ్యం భళ్ళున పగిలిన ఎన్నో రూపుల ప్రతిబింబం అవుతున్నది వివస్త్రను చేసి నడిరోడ్డుపై నడిపిన దుర్మార్గంపుట్టలు మొలిచిన మెదడులకు ప్రతిబింబం అవుతున్నాయి మణిపూర్, కాంగ్పోప్కి జిల్లా ఇంఫాల్‌కు ఓ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం మైథీలు మెజారిటీ ప్రజలు, కుకీ తెగలుకొండ ప్రాంతపు ప్రజలు లోయాలో ఒక లోయ ప్రాంతం వర్గ పోరు హింస ఇద్దరు మహిళలు వార్తా విశేషాలయ్యారు కానీ.. కానీ.. ఆ రోజు ఏమైందంటేదేశం తలవంచిందన్న సత్యాన్ని మొత్తం బొత్తాములతో కట్టలేక, కొన్ని మేధావుల బుర్రలు, సున్నిత మనసులు భరత మాత పాదాలను కన్నీటితో కడుగుతున్నాయి హృదయాలు

మీ నేపథ్యం?ఎప్పటినుండి రాస్తు న్నారు? అచ్చయిన మీ రచనలు? సాహితీ ప్రక్రియల గురించి క్లుప్తంగా చెబుతారా? మా ఊరు చిన్న పెండ్యాల. వరంగల్. మా అమ్మ కౌసల్యాదేవి. నాన్న పెండ్యాల రాఘవరావు. వరంగల్ జిల్లా మొట్ట మొదటి ఎం.పి. సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. నా భర్త కొండపల్లి వేణుగోపాలరావు. మాకు ఇద్దరు పిల్లలు. మా మామగారు ప్రసిద్ధ చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు. రెండూ గొప్ప చరిత్రలు కలిగిన కుటుంబాల నేపథ్యం నాది. వ్యక్తిగతంగా నేను కవయిత్రిని, రచయిత్రిని. ఎం.ఎ, టి.పి.టి చేసి, 20 ఏళ్లు తెలుగు ఉపాధ్యాయినిగా చేశాను. స్వచ్ఛంద విరమణ అనంతరం ‘ఒద్దిరాజు సోదరుల జీవితం- సాహిత్యం’పై ఉ స్మానియా యూనివర్సిటీలో పి. హెచ్.డి చేసి డాక్టరేట్ తెచ్చుకున్నాను. 198788 నుండి కవిత్వం, వ్యా సాలు రాస్తున్నాను. కానీ పత్రికల్లో నేను ఆలస్యంగా కనిపించాను.4 కవితా సంపుటాలు, 2 కథా సంపుటాలు, 8 సాహిత్య విమర్శ వ్యాస సంపుటాలు, 3 జీవిత చరిత్రలు, ‘అమెరికాలో ఆరు నెలలు’ అనే యాత్రా చరిత్ర, పీహెచ్‌డి గ్రంథం (700పేజీలు) వంటి నా స్వంత పుస్తకాలు 20 ప్రచురించాను. మరో 8 ముద్రణకు సిద్ధంగా ఉన్నవి. 10 పుస్తకాలకు సంపాదకత్వం వహించాను. 2021 న

అమరావతి: లారీని వెనుక నుంచి కారుతో ఢీకొట్టడంతో ఒకరు సజీవదహనమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారి 16పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గండిగుండం పరిధిలోని సత్తరువు చౌరస్తా వద్ద ముందుగా వెళ్తున్న లారీని కారు అదుపుతప్పి ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ కారులో నుంచి బయటకు రాలేక సజీవదహనమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడి వివరాలు వెల్లడిస్తామన్నారు.






మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల క్రాస్ రోడ్డులోని డిపిఆర్ పంక్షన్ హాల్లో బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పొన్నబోయిన రమేష్ కుమార్తె భవానీ - అఖిల్ ల వివాహ వేడుక జరిగింది. వివాహ వేడుకల్లో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ పాల్గొని నూతన వదూ వరులను ఆశీర్వదించారు. బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, బిఆర్ ఎస్ మండల పార్టీ నాయకులు రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, కోణతం యాకూబ్ రెడ్డి, తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేంద్ర నాద్, గజ్జి మల్లేశ్, జంగ శ్రీనివాస్, పానుగుళ్ల విష్ణు మూర్తి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.