
వావ్రే(బెల్జియం): పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో జర్మనీ విజేతగా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో జర్మనీ 10 గోల్ తేడాతో స్పెయిన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన తుది సమరంలో జర్మనీ అతి కష్టం మీద విజయం సాధించింది. జర్మనీకి ఇది నాలుగో ప్రపంచ కప్ ట్రోఫీ కావడం విశేషం. ఇక అర్జెంటీనా టీమ్ కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఆదివారం వావ్రే వేదికగా మూడో స్థానం కోసం నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో అర్జెంటీనా 21 గోల్స్ తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో అర్జెంటీనా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ప్రారంభం నుంచే ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు పోరాడాయి.
ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరూ దాడులు చేస్తూ గోల్స్ కోసం ప్రయత్నించాయి. కానీ ప్రథమార్ధంలో రెండు జట్లకు ఒక్క గోల్ కూడా లభించలేదు. అయితే రెండో హాఫ్ ఆరంభంలోనే అర్జెంటీనా బోణీ కొట్టింది. టొమాస్ డొమెనె 41వ నిమిషంలో జట్టుకు తొలి గోల్ సాధించి పెట్టాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ ఎదురుదాడికి దిగింది. ప్రత్యర్థి జట్టుపై వరుస దాడులు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే క్రమంలో 49వ నిమిషంలో ఫ్లోరిస్ నెదర్లాండ్స్‌కు గోల్ అందించాడు. దీంతో 11తో స్కోరు సమమైంది. ఆ తర్వాత రెండు జట్లు ఆధిక్యం కోసం సర్వం ఒడ్డి పోరాడాయి. కాగా, 59వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మతియాస్ రే అద్భుత గోల్ సాధించి జట్టుకు అద్భుత విజయం అందించాడు. ఈ గెలుపుతో అర్జెంటీనా కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఇక మహిళల విభాగంలో అర్జెంటీనా ప్రపంచకప్ ట్రోఫీని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఓడించి అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది.











