25085 articles

14 ఏళ్లకే ఐపిఎల్‌లోకి అడుగుపెట్టి.. తన ఆటతో దేశవ్యాప్తంగా అందరిని కట్టపడేసిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. అంతేకాక.. టీం ఇండియాలో చోటు దక్కించుకున్న అతి చిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు సృష్టించాడు. అయితే క్రికెట్‌లో తన ఆటతో అభిమానులను సంపాదించుకున్న వైభవ్.. ఇప్పుడు గొప్ప మనసు చాటుకున్నాడు. విద్యార్థులకు సాయం చేసేందుకు అతడు ముందుకొచ్చాడు. ‘‘గొప్ప విషయాలు రాబోతున్నాయి.. అలాగే చూస్తూ ఉండండీ’’ అంటూ శుక్రవారం వైభవ్ తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఏంటా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇవాళ ఉదయం ఓ ప్రకటన చేశాడు. ‘నాకు ఎక్స్ ఫ్లాట్‌ఫామ్ నుంచి వచ్చే ఆదాయాన్ని అవసరమైన విద్యార్థుల చదువుకు వెచ్చించాలని భావిస్తున్నా.అర్హత కలిగిన వారు సంప్రదించగలరు. పాఠశాల, కళాశాలకు సంబంధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి సాయంగా ఉంటా. నాకు తోచినరీతిలో మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’’ అని వైభవ్ పోస్ట్ పెట్టాడు. దీంతో యువ క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చిన్న వయసులోనే ఇంతటి గొప్ప ఆలోచన చేసినందుకు అభినందనలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.






దర్శకుడిగా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు అందించిన లోకేశ్ కనకరాజ్ హీరోగా పరిచయమైన సినిమా ‘డిసి’. ఈ నెల 7న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సన్‌నెక్ట్స్ వేదికగా సెప్టెంబర్ 4 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ సంస్థ పోస్ట్‌ను పంచుకుంది. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.


అమరావతి: మనం తీసుకునే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో సిఎం పర్యటించారు. గన్నెలలో ఆరోగ్య రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని, సంజీవని పథకం రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్ లా మారుతుందని, అందరికీ ఆరోగ్యమని తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతానికి వస్తే కొత్త శక్తి ఉత్సాహం వస్తుందని, ఏజెన్సీ ఏరియాల్లో అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఏజెన్సీలోని అన్ని గ్రామాలకు రోడ్లు వేయిస్తామని అన్నారు. ఆ రోజుల్లోనే గిరిజనులకు ఆయుర్వేద వైద్యం అందించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. గిరిజనులకు నీళ్లు ఇస్తాం.. సోలార్ వెలుగులు తీసుకొస్తామని, ఏజెన్సీ ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రకృతి సేద్యానికి ఏజెన్సీ మారు పేరుగా మారిందని, ప్రకృతి సేద్యాన్ని కాపాడుకుంటే మార్కెట్ లో తిరుగుండదని చంద్రబాబు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశ







ఢిల్లీ: భారత రాజ్యంగం ప్రకారం దళితులను అంటరానివారిగా చూడటం నేరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. శుద్ధీకరణ పేరుతో చేసేవన్నీ అంటరానితనానికి మరో పేరు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శుద్ధీకరణ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని, శుద్ధీకరణ చేపట్టమంటే ఎస్సి,ఎస్టి చట్టాన్ని ఉల్లంఘించడమేనని సూచించారు. అన్నికులాలకు చెందిన వాడినని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకుంటారని, బిజెపి నేతలు మాత్రం శుద్ధీకరణ పాటిస్తారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆలయాన్ని సందర్శించిన తర్వాత బిజెపి నేతలు శుద్ధీకరణ చేశారని, శుద్ధీకరణ లాంటి కార్యక్రమాలు బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేస్తారని మండిపడ్డారు. బిజెపి కొత్త సంస్థాగత నిర్మాణంపై తనకు ఆసక్తి లేదని, బిజెపికి కొత్త సంస్థ వచ్చినా, పాతదే కంటిన్యూ అయినా తేడా ఉండదని అన్నారు. కాంగ్రెస్ పోరాటం వ్యక్తులు, సంస్థాగత మార్పులపై కాదని, భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తమ పోరాటమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది ఖర్గే ఒక్కరి సమస్య కాదని, ప్రతీ దళితుడి సమస్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గేకు కాంగ్రెస్ నుంచి పెద్ద సపోర్ట్



టి-20 ప్రపంచకప్‌ను టీం ఇండియాకు అందించిన సరే.. జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు జట్టు తప్పగాలు అప్పగించారు. దాదాపు రెండు నెలల తర్వాత ఈ విషయంపై సూర్య స్పందించాడు. తనను కెప్టెన్సీ తప్పించారని తెలిసి నవ్వుకున్నాను అని సూర్య అన్నాడు. ఒలింపిక్స్‌తో పాటు వచ్చే టి-20 ప్రపంచకప్‌లోనూ జట్టును నడిపిస్తానని తాను తొలుత అనుకున్నట్లు వెల్లడించాడు. కానీ, సెలక్టర్లు మాత్రం భిన్నంగా ఆలోచించారు. ‘‘జట్టు సారథిగా నా పేరు లేదని తెలిసినప్పుడు నవ్వానంతే. క్రికెట్ ఆడుతున్నప్పుడు.. ఒత్తిడి ఉన్న ప్రతి సందర్భంలో నవ్వుతూనే ఉన్నా. ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. అలాగే నాకు ఆడే అవకాశాలు లభించిన ప్రతిసారీ కృతజ్ఞతతోనే ఉన్నా. నిజానికి.. ఇలా జరుగుతుందని ఊహించలేదు. 2026లో కప్ గెలిచిన తర్వాత.. మరో రెండేళ్లూ ఈ జట్టును నేనే నడిపిస్తానని అనుకున్నా. రాబోయే ఒలింపిక్స్‌లోనూ జట్టుకు సారథ్యం వహిస్తానని భావించా. అయితే, ఇతరుల ఆలోచరనలు వీటికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వారి నిర్ణయాలను మనం గౌరవించాలి. ఈ జట్టు మరొకరి సారథ్యంలో రాణిస్తే మంచిదే కద


హైదరాబాద్: ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం వేటు వేసింది. వెంటనే ఎంఎల్ సికి రాజీనామాకు చేయాలని ఆదేశించింది. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై ఆ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. ఎంఐఎం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తన ఎక్స్ ఖాతాలో పార్టీ ప్రకంటించింది. వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మండలి ఛైర్మన్‌కు లేఖ పంపాలని ఆదేశించింది. 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్ బేగ్ పదవీకాలం 2029 మే వరకు ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ మీర్జా రహ్మత్ బేగ్ పట్టుబడడడంతో ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. అత్తాపూర్‌లో కొందరు యువకులు ఎంఎల్ సిని పట్టుకుని కొట్టడంతో పాటు వీడియోలు తీసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలుసని, అయినా రహ్మత్ బేగ్‌ను ఉమ్రాకు పంపించారని సబ్దర్ అలీ ఆరోపణలు చేశారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండా సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. ఎంఎల్ఎకు సంబంధించిన వీడియో సోషల్ మీ

