
హైదరాబాద్: ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం వేటు వేసింది. వెంటనే ఎంఎల్ సికి రాజీనామాకు చేయాలని ఆదేశించింది. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై ఆ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. ఎంఐఎం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తన ఎక్స్ ఖాతాలో పార్టీ ప్రకంటించింది. వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మండలి ఛైర్మన్‌కు లేఖ పంపాలని ఆదేశించింది. 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్ బేగ్ పదవీకాలం 2029 మే వరకు ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ మీర్జా రహ్మత్ బేగ్ పట్టుబడడడంతో ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. అత్తాపూర్‌లో కొందరు యువకులు ఎంఎల్ సిని పట్టుకుని కొట్టడంతో పాటు వీడియోలు తీసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలుసని, అయినా రహ్మత్ బేగ్‌ను ఉమ్రాకు పంపించారని సబ్దర్ అలీ ఆరోపణలు చేశారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండా సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. ఎంఎల్ఎకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోవైరల్ గా మారినట్టు సమాచారం.











