25059 articles





హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన రియాల్టీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు ఈ సారి దశావతారం కాన్సెప్ట్‌తో ఈ షో పలకరించనుంది. తాజాగా దీని విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 6 సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ లాంచ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో బిగ్‌బాస్ హోస్ట్, కింగ్ నాగార్జున వివిధ గెటప్‌లలో కనిపించారు. ‘మీరు ఎంతైనా ఊహించుకోండి.. దాన్ని మించి ఈ సీజన్ ఉంటుంది. ఈ సారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’’ అంటూ వీడియోని పంచుకున్నారు. సర్‌ప్రైజ్‌లు, డ్రామా, సవాళ్లు అన్నీ 10 రెట్లు ఉంటాయని తెలిపారు. స్టార్ మా, హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈసారి సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.




నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ‘ఏషనాగుల’ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేశ్‌తో కలిసి నాని డ్యాన్స్ ఇరగదీశారు. అనిరుధ్ రవిచంద్రన్ తన మ్యూజిక్‌తో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు. కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. ప్రభ బంగారిగళ్ళ, అద్దుల జంగిరెడ్డి ఆలపించారు. ఆట సందీప్ మాస్టర్ ఈ పాటను కొరియోగ్రాఫీ చేశారు. ఈ సాంగ్‌కి థియేటర్ల పూనకాలే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.




ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి జపాన్‌లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ ఆసియా క్రీడలకు ముందు భారత బృందానికి షాక్ తగిలింది. జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గాయపడ్డాడు. శిక్షణ సమయంలో అతడి చీలమండ లిగమెంట్‌కు గాయమైంది. దీంతో ఆసియా క్రీడలకు అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా శనివారం సోషల్‌మీడియా ద్వారా తెలియజేశాడు. ‘‘ఎంతో కష్టపడిన తర్వాత లుసానె డైమండ్ లీగ్‌లో ఈ సీజన్‌లో అత్యుత్తమ (88.05 మీటర్లు) త్రోను అందుకున్నట్లు అనిపించింది. దురదృష్టవశాత్తు ఆ తర్వాత కొద్ది కాలానికే శిక్షణ సమయంలో నా చీలమండ వద్ద లిగమెంట్ చిట్లపోయింది. వైద్యుడితో పాటు నా టీమ్‌తో చర్చించిన తర్వాత ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది నిరాశ కలిగించే విషయం. నా ఆటలో రిథమ్‌ను అందుకునే దశకు చేరుకున్నానని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం బాధాకరం. ఇప్పుడు నా దృష్టి పూర్తిగా కోలుకోవడం, మరింత దృఢంగా తిరిగి రావడంపైనే ఉంది’’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.



న్యూఢిల్లీ : యాక్సిస్ బ్యాంక్, ఎస్‌ఎస్‌ఎఐటి భాగస్వామ్యంతో కన్హౌలీలో దేశంలోనే తొలి ఒలింపిక్ ప్రమాణాల ఆర్చరీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇది తూర్పు యుపి, బీహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ క్రీడాకారులకు 3 ఏళ్లలో అందుబాటులోకి వస్తుంది. ఏటా 100 మంది రెసిడెంట్, 300 మంది ఇతర అథ్లెట్లకు శిక్షణ ఇస్తారు. విజయ్ ముల్బాగల్ మాట్లాడుతూ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడమే లక్ష్యమన్నారు.


అమరావతి: తనపై నమ్మకద్రోహి అంటూ వైసిపి కోటరీ దుష్ప్రచారం చేస్తోందని మాజీ ఎంపి విజయసాయి రెడ్డి ఆరోపించారు. నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్ తో సంధి చేసుకునేవాణ్ణినని అన్నారు. విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిబిఐ, ఇడి ఛార్జిషీట్లలో తన పేరు లేకుండా చేసుకునేవాణ్ణినని, నమ్మకస్తుణ్ని అనే కారణంతో ప్రతి ఛార్జిషీట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తన పేరు చేర్చిందని తెలియజేశారు. ఇప్పుడు వైసిపిలో నంబర్-2 జగన్, నంబర్-1 సజ్జల అని.. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే తనను 15 నెలలు జైల్లో పెట్టారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నమ్మక ద్రోహం తన రక్తంతో ఉంటే, అప్పుడే అప్రూవర్ గా మారేవాడినని, తనకు సంబంధం లేని లిక్కర్ స్కామ్ లోనూ తనను ఎ-5గా చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.కాకినాడ సిపోర్టు కేసులో తనను ఎ-2 గా చేర్చారని, సకల శాఖల మంత్రి పేరు మాత్రం ఇంతవరకు ఏ ఛార్జిషీట్ లోనూ లేదని మండిపడ్డారు. ఏ కేసులూ లేకుండా ఎలానో కోటరీ నాయకుడికి తెలిసినంత తనకు తెలియదని, తాను ఏనాడు నమ్మక ద్రోహం పనులు చేయలేదని అన్నారు. పార్టీ మారేందుకు సిద్ధమైన ఉత్తరాంధ్ర నేతతో కలిసి కోటరీ నాయకుడు క





14 ఏళ్లకే ఐపిఎల్‌లోకి అడుగుపెట్టి.. తన ఆటతో దేశవ్యాప్తంగా అందరిని కట్టపడేసిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. అంతేకాక.. టీం ఇండియాలో చోటు దక్కించుకున్న అతి చిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు సృష్టించాడు. అయితే క్రికెట్‌లో తన ఆటతో అభిమానులను సంపాదించుకున్న వైభవ్.. ఇప్పుడు గొప్ప మనసు చాటుకున్నాడు. విద్యార్థులకు సాయం చేసేందుకు అతడు ముందుకొచ్చాడు. ‘‘గొప్ప విషయాలు రాబోతున్నాయి.. అలాగే చూస్తూ ఉండండీ’’ అంటూ శుక్రవారం వైభవ్ తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఏంటా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇవాళ ఉదయం ఓ ప్రకటన చేశాడు. ‘నాకు ఎక్స్ ఫ్లాట్‌ఫామ్ నుంచి వచ్చే ఆదాయాన్ని అవసరమైన విద్యార్థుల చదువుకు వెచ్చించాలని భావిస్తున్నా.అర్హత కలిగిన వారు సంప్రదించగలరు. పాఠశాల, కళాశాలకు సంబంధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి సాయంగా ఉంటా. నాకు తోచినరీతిలో మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’’ అని వైభవ్ పోస్ట్ పెట్టాడు. దీంతో యువ క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చిన్న వయసులోనే ఇంతటి గొప్ప ఆలోచన చేసినందుకు అభినందనలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.