24605 articles




తెలంగాణ మట్టి వాసనలతో సంచలనమైన జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు దగ్గరైన కిట్టు హీరోగా సినిమా ప్రారంభమైంది. యం.యస్ వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా పతాకంపై ప్రొడక్షన్ నం 3గా ముని శివ, శివమల్లాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దిలీప్ సాయి నాయక్. శివమ్ మీడియా కార్యాలయంలో ఈ చిత్రం వైభవంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, ఆర్.పి పట్నాయక్, సతీష్ వేగేశ్న, విజయ్ రెడ్డి వెన్నం హాజరయ్యారు. దర్శకుడు దిలీప్‌కి స్క్రిప్ట్‌ని సతీష్ వేగేశ్న, బుల్లెట్‌బండి లక్ష్మణ్ అందించగా హీరో కిట్టుపై చంద్రబోస్ క్లాప్ నిచ్చారు. ఆర్ పి పట్నాయక్ తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా విజయ్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు. చంద్రబోస్ మాట్లాడుతూ- ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మదిన్, జనతా బబ్లూ పాల్గొన్నారు.




నవతెలంగాణ – హైదరాబాద్ : మాంసం ప్రియులకు షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. గత వారం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.200-240 ఉండగా, ఆదివారం నాటికి రూ.220-270కు చేరింది. నిజామాబాద్‌లో అత్యధికంగా రూ.270 పలకగా, వరంగల్, సూర్యాపేట, కామారెడ్డిలో రూ.250, ఖమ్మంలో రూ.220-240 వరకు విక్రయిస్తున్నారు. గుంటూరులో రూ.260, పల్నాడులో రూ.230-250, విశాఖలో రూ.240, చిత్తూరులో రూ.220 వరకు ధరలు నమోదయ్యాయి. The post పెరిగిన చికెన్ ధరలు appeared first on Navatelangana.



దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పీజీ 2026 పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒకే షిఫ్ట్ లో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష జరగనుంది. అభ్యర్థులకు ఆధార్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి కాబట్టి.. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి తమ హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డును కూడా తప్పనిసరిగా తీసుకువెళ్లాలి.దేశవ్యాప్తంగా 2,73,183 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. తెలంగాణలో 14 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో 17,600 మంది అభ్యర్థులు.. ఎపిలోలో 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ ఏడాది నీట్ పీజీ పరీక్ష విధానంలో మార్పులు చేశారు. మొత్తం 180 ప్రశ్నలకు 210 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.







తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవురోజు కావడంతో తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. దీంతో స్వామివారిని సర్వ దర్శనం కోసం వచ్చిన భక్తులు.. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్టుమెంట్లు వేచి ఉన్నారు. ఈ క్రమంలో తిరుమల వెంకన్నదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 10 నుంచి 12 గంటలు పడుతుంది. ఇక, శనివారం శ్రీవారిని 85,246 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 34,085 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.3 కోట్లుగా ఉన్నట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.





నవతెలంగాణ – హైదరాబాద్ :మహిళల హాకీ ప్రపంచకప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. నిన్న ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో, షూటౌట్‌లో 3-1 తేడాతో ఆతిథ్య నెదర్లాండ్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. ఆట 30వ నిమిషంలో యిబీ జాన్సన్ గోల్ చేయడంతో నెదర్లాండ్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, ద్వితీయార్థంలో పుంజుకున్న అర్జెంటీనా 54వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను […] The post హాకీ ప్రపంచకప్ విజేత అర్జెంటీనా appeared first on Navatelangana.