
దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పీజీ 2026 పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒకే షిఫ్ట్ లో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష జరగనుంది. అభ్యర్థులకు ఆధార్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి కాబట్టి.. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి తమ హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డును కూడా తప్పనిసరిగా తీసుకువెళ్లాలి.
దేశవ్యాప్తంగా 2,73,183 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. తెలంగాణలో 14 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో 17,600 మంది అభ్యర్థులు.. ఎపిలోలో 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ ఏడాది నీట్ పీజీ పరీక్ష విధానంలో మార్పులు చేశారు. మొత్తం 180 ప్రశ్నలకు 210 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.











