24517 articles




న్యూఢిల్లీ: వచ్చే నెల 12న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ 57వ సమావేశం జరగడానికి ఒక రోజు ముందు, అనగా సెప్టెంబర్ 11న జిఎస్‌టి అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు కౌన్సిల్ సచివాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొననున్నట్టు తెలిపింది. అయితే, గత సంవత్సరం జరిగిన సమావేశంలో వస్తువులు, సేవలపై జిఎస్‌టి రేట్లు, పన్ను శ్లాబుల్లో భారీ మార్పులకు కేంద్రం, రాష్ట్రాలు నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు జరుగబోయే కౌన్సిల్ సమావేశంలో, నెలకు రూ.2.5 లక్షలకు పైగా పన్ను క్రెడిట్‌ను ఇతరులకు బదిలీ చేసే వ్యాపార సంస్థలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసే అంశంపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా, జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియలో ఆటోమేషన్‌తో పాటు ఇతర మార్పులను కూడా కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకు రూ.2.5 లక్షలకు పైగా పన్ను క్రెడిట్‌ను బదిలీ చేసే పెద్ద వ్యాపార సంస్థలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ మంజూరు చేసే విషయంలో కేంద్ర జీఎస్టీ విభాగాలు, వివిధ రాష్ట్రాల జీఎస్టీ విభాగాలు అనుసరిస్తున్న విధానాల్లో ఏకరూపత

నవతెలంగాణ – హైదరాబాద్ :దేశవ్యాప్తంగా ‘నీట్ పీజీ 2026’ పరీక్ష ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఓ విద్యార్థి మద్యం తాగి పరీక్ష రాసేందుకు వచ్చాడు. దీంతో అతడిని సిబ్బంది గుర్తించి వెనక్కి పంపారు. దేశవ్యాప్తంగా 1300 కేంద్రాల్లో ఈ పీజీ పరీక్ష జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరగనుంది. The post నీట్ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి appeared first on Navatelangana.

విండ్‌హోక్: జింబాబ్వే, నమీబియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో పసికూన నమీబియా చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న సౌతాఫ్రికా జట్టు.. శనివారం జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. సికూన నమీబియా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 145 పరుగులు చేయగా.. అనంతరం లక్ష ఛేదనకు దిగిన సఫారీ టీమ్ భీకర బ్యాటింగ్‌తో 13.4 ఓవర్లలోనే కేవలం 3 వికెటుల మాత్రమే కోల్పోయి లక్షాన్ని అందుకుంది. డెవాల్ బ్రెవిస్ (75 నాటౌట్) విధ్వంసం సృష్టించి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఓపెనర్లు ప్రిటోరియస్(22), జోర్డాన్ హెర్మన్(20) విఫమైనా డెవాల్ చెరేగిపోయాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్, బ్లెసింగ్ ముజరబానీ, నైమురి తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (34), మరుమనీ (30) టాప్ స్కోరర్లు.






తెలంగాణ మట్టి వాసనలతో సంచలనమైన జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు దగ్గరైన కిట్టు హీరోగా సినిమా ప్రారంభమైంది. యం.యస్ వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా పతాకంపై ప్రొడక్షన్ నం 3గా ముని శివ, శివమల్లాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దిలీప్ సాయి నాయక్. శివమ్ మీడియా కార్యాలయంలో ఈ చిత్రం వైభవంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, ఆర్.పి పట్నాయక్, సతీష్ వేగేశ్న, విజయ్ రెడ్డి వెన్నం హాజరయ్యారు. దర్శకుడు దిలీప్‌కి స్క్రిప్ట్‌ని సతీష్ వేగేశ్న, బుల్లెట్‌బండి లక్ష్మణ్ అందించగా హీరో కిట్టుపై చంద్రబోస్ క్లాప్ నిచ్చారు. ఆర్ పి పట్నాయక్ తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా విజయ్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు. చంద్రబోస్ మాట్లాడుతూ- ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మదిన్, జనతా బబ్లూ పాల్గొన్నారు.




నవతెలంగాణ – హైదరాబాద్ : మాంసం ప్రియులకు షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. గత వారం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.200-240 ఉండగా, ఆదివారం నాటికి రూ.220-270కు చేరింది. నిజామాబాద్‌లో అత్యధికంగా రూ.270 పలకగా, వరంగల్, సూర్యాపేట, కామారెడ్డిలో రూ.250, ఖమ్మంలో రూ.220-240 వరకు విక్రయిస్తున్నారు. గుంటూరులో రూ.260, పల్నాడులో రూ.230-250, విశాఖలో రూ.240, చిత్తూరులో రూ.220 వరకు ధరలు నమోదయ్యాయి. The post పెరిగిన చికెన్ ధరలు appeared first on Navatelangana.



దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పీజీ 2026 పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒకే షిఫ్ట్ లో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష జరగనుంది. అభ్యర్థులకు ఆధార్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి కాబట్టి.. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి తమ హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డును కూడా తప్పనిసరిగా తీసుకువెళ్లాలి.దేశవ్యాప్తంగా 2,73,183 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. తెలంగాణలో 14 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో 17,600 మంది అభ్యర్థులు.. ఎపిలోలో 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ ఏడాది నీట్ పీజీ పరీక్ష విధానంలో మార్పులు చేశారు. మొత్తం 180 ప్రశ్నలకు 210 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.



