
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ టీషర్టులు వేసుకుని పార్లమెంట్ కు వెళ్లారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ టీషర్టులతో పార్లమెంట్ కు వెళ్లినప్పుడు తాము అసెంబ్లీకి వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్ల టీషర్టుపై ఏముందని? హామీలు అమలు చేయాలని మాత్రమే ఉందని, నిరసన తెలిపే హక్కు తమకూ ఉందని తెలియజేశారు. తమ ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు స్వల్ప గాయాలయ్యాయని అన్నారు. హామీలు అమలు చేయలేదని ప్రశ్నిస్తే తప్పా? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి వస్తే ప్రశ్నిస్తారనే అడ్డుకుంటున్నారని, ప్రధాన ప్రతిపక్షం లేకుండానే చర్చ జరపాలని చూస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.








