
ప్రముఖ హిందీ రియాల్టీ షో బిగ్‌బాస్ 20వ సీజన్ సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమైంది. ఇందులో కంటెస్టెంట్‌గా ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ అడుగుపెట్టారు. రాబోయే 105 ఎపిసోడ్లు ఆమె హఔస్‌లో గడపనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆమెకు విషెస్ తెలుపుతూ వీడియో రిలీజ్ చేశారు.
2014లో తెరకెక్కిన మేరికోమ్ బయోపిక్‌లో ప్రియాంక ప్రధాన పాత్రలో నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇక మేరీకోమ్ బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లడంతో ఈ షోలో పాల్గొన్న ఇతర కంటస్టెంట్లను ఉద్దేశించి ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘మేరీకోమ్ మన దేశానికి గర్వకారణం. బిగ్‌బాస్ 20లో ఆమె ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. అయితే, హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లు ఆమె పంచ్‌లతో కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది’’ అని ప్రియాంక సరదాగా చెప్పారు.








