హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ గతంలో బూతులు మాట్లాడినప్పుడు హీరోలా ఫీయ్యారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బూతుల విషయంలో కెసిఆర్ దే తప్పు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు అదే భాషను కెసిఆర్ పై ఉపయోగిస్తే నానా యాగీ చేస్తున్నారని, కెసిఆర్ మాట్లాడిన భాష వల్లే తెలంగాణ భాషకు చెడ్డ పేరు వచ్చిందని ఉత్తమ్ విమర్శించారు. ఇరిగేషన్ విషయంలో కెసిఆర్ తప్పులే ప్రస్తుతం సమస్యలకు కారణమని, కెసిఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారని, కెసిఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటేనే మంచిదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.