ముంబై: భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ)కు ఇంటర్నేషనల్ ఒలింపిక్ సంఘం(ఐఒఎ) షాక్ ఇచ్చింది. ఆసియా క్రీడల్లో క్రికెటర్ల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనలో లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకోలేమంటూ ప్రకటన చేసింది. ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్, 500 మీటర్ల దూరంలో వాష్‌రూమ్‌పై భారత బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. క్రీడా నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాటితోనే సర్దుకుపోవాలని సూచించింది. ఒకవేళ భారత క్రికెటర్లకు ఇబ్బందిగా ఉంటుందని భావిస్తే.. సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

దాంతో.. టోర్నీ నిర్వాహకులను నమ్ముకునే కంటే భారత ప్లేయర్ల కోసం మెరుగైన వసతులు కల్పించడంపై బిసిసిఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. జపాన్‌లోని ఐచీ- నగోయాలో టెంట్‌లో ఈనెల 19వ తేదీ నుంచి ఆసియా క్రీడలు ప్రారంభంకానున్నాయి. అయితే.. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే అథ్లెట్లు, క్రికెటర్లకు వసతులు వారికి తగ్గట్టు లేవు. దీంతో టెంట్లు, కంటైనర్లలో వసతి, ఆమడ దూరంలో టాయిలెట్లు.. వంటివి క్రికెటర్లకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని, ఇది ఆటగాళ్ల ఏకగ్రతపై ప్రభావం చూపుతుందని బిసిసిఐ అభ్యంతరం తెలిపింది.