🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4208 వార్తలు

రేపు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారె పర్యటన
పాత
తెలంగాణ

రేపు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారె పర్యటన

– కార్యక్రమ వివరాలు వెల్లడించిన కార్యాలయ సిబ్బందినవతెలంగాణ – అశ్వారావుపేటప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొననున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన కార్యాలయ సిబ్బంది కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఉదయం 9 గంటలకు తిరుమలకుంట గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు […] The post రేపు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారె పర్యటన appeared first on Navatelangana.

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
పాత
తెలంగాణ

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా ఏడు మ్యాచులు ఆడితే రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించి.. గెలుపు ఖాతా తెరిచింది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు లక్నో వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం లక్నోకి కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో లక్నో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సిద్ధార్త్ స్థానంలో లిండే జట్టులోకి వచ్చాడు. కోల్‌కతా గత మ్యాచ్‌లోని జట్టునే కొనసాగిస్తోంది. తుది జట్లు: ఎల్‌ఎస్‌జి: ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, ముకుల్ చౌదరీ, జార్జ్ లిండే, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, మోసిన్ ఖాన్. కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), టిమ్ సీఫర్ట్(కీపర్), కామరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రోమ్‌మెన్ పోవెల్, రింకూ సింగ్, సునీల్ సరైన్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ.

మళ్లీ మొదలైన డీజిల్ తిప్పలు.. పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు
పాత
పార్టీని వీడిన ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి: రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి
పాత
తెలంగాణ

పార్టీని వీడిన ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి: రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి

నవతెలంగాణ – న్యూఢిల్లీ : అశోక్ కుమార్ మిట్టల్, రాఘవ్ చద్దాతోపాటు ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలో వీలైనమనట్లు శుక్రవారం ప్రకటించారు. తాజాగా ఈ ఎంపీలందరిపై అనర్హత వేటు వేయమని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ఆదివారం రాజ్యసభ ఛైర్మన్ సి. పి రాధాకృష్ణన్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటువంటి ఫిరాయింపులు ముఖ్యంగా పంజాబ్‌లో ప్రజల తీర్పుకు ద్రోహం చేయడమే కాకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని` ఆయన ఆరోపించారు. […] The post పార్టీని వీడిన ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి: రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి appeared first on Navatelangana.

వడదెబ్బతో వ్యక్తి మృతి
పాత
పోతారంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పాత
తెలంగాణ

పోతారంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

నవతెలంగాణ – కామారెడ్డి పాల్వంచ మండలంలోని పోతారం గ్రామంలో ఆదివారం పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఎప్పుడూ అంకిత భావంతోనే పనిచేస్తుందన్నారు. రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తూ వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటున్నాయన్నారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. “రైతు బాగుంటే దేశం […] The post పోతారంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.

రజతోత్సవ ముగింపు వేడుకలు విజయవంతం చేద్దాం
పాత
తెలంగాణ

రజతోత్సవ ముగింపు వేడుకలు విజయవంతం చేద్దాం

– బీఆర్ఎస్ నాయకులు సంపూర్ణ పార్టీ శ్రేణులకు పిలుపునవతెలంగాణ – అశ్వారావుపేట బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ అశ్వారావుపేట పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ పార్టీ శ్రేణులకు ఆదివారం పిలుపునిచ్చారు. సోమవారం నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో ని మూడు రోడ్ల ప్రధాన కూడలి లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుందని, కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున […] The post రజతోత్సవ ముగింపు వేడుకలు విజయవంతం చేద్దాం appeared first on Navatelangana.

ఢిల్లీకి మూటలు మోయటం తప్ప రేవంత్ చేసిందేమీ లేదు: కెటిఆర్
పాత
తెలంగాణ

ఢిల్లీకి మూటలు మోయటం తప్ప రేవంత్ చేసిందేమీ లేదు: కెటిఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్‌పై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. స్కైరూట్ కంపెనీ తాము తెస్తే.. ఈ సిఎం రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. బిఆర్ఎస్ బలం పెరిగిందని కెటిఆర్ అన్నారు. ‘‘మోసపు హామీలు నమ్మి.. ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. కాంగ్రెస్‌లో కమల్‌హాసన్‌ను మించిన నటులు ఉన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి? మూసీని దుర్గంధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రూ.3.70 లక్షల కోట్లు అప్పు చేశానని రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఢిల్లీకి మూటలు మోయటం తప్ప.. ఆయన చేసిందేమీ లేదు’’ అని కెటిఆర్ ఆరోపించారు.

MS ధోనీ రికార్డు బద్దలు కొట్టిన సంజు శాంసన్..
పాత
రష్యాలో కీలక ఎరువుల ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి
పాత
తెలంగాణ

రష్యాలో కీలక ఎరువుల ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి

మాస్కో: వాయువ్య రష్యాలో కీలకమైన ఎరువుల ప్లాంట్ ‘ఫోస్ ఆగ్రో’పై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసింది. ఏప్రిల్ నెలలో ఈ ప్లాంట్‌పై దాడి జరగడం ఇది రెండోసారి. రష్యా కీలక ఎగుమతి కేంద్రాలపై ఇటీవల కాలంలో ఉక్రెయిన్ దాడులు తీవ్రమయ్యాయి. ఈ ప్లాంట్‌లోని సల్ఫూరిక్ యాసిడ్ పంప్ చేసే హై ప్రెజర్ పైప్‌లైన్లను ఈ డ్రోన్లు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని వోలోగ్డా గవర్నర్ జార్జి ఫలిమొనోవ్ ధృవీకరించారు. కాకపోతే ఎటువంటి మంటలు లేదా లీకేజీకి ఈ దాడి కారణం కాలేదని వెల్లడించారు. పైప్‌లైన్‌కు వెంటనే మరమ్మతులు నిర్వహించినట్లు తెలిపారు. దీంతో ప్రమాదకర గ్యాస్‌లు కూడా ఏమీ లీక్ కాలేదని చెప్పారు. ‘ఫోస్ అగ్రో’ ప్రతినధి మాత్రం ఈ దాడిపై స్పందించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం పశ్చిమాసియా యు్ధం తీవ్రస్థాయిలో ఉండటంతో నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో పాటు రష్యా, చైనా దేశలు వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. రష్యా వంటి ఫాస్ఫరస్ ఆధారిత ఎరువులను భారత్‌కు ఎగువతి చేసే కంపెనీల్లో ఇది కూడా ఉంది.

గత పదేళ్లలో బీఆర్ఎస్ పేద ప్రజలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు...కేసీఆర్, కేటీఆర్ సిగ్గుపడాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పాత
మెడిసిన్ ప్యాకెట్స్పైన ఉండే ఎర్రని గీతకు అర్థం ఏంటో 90 శాతం మందికి తెలియదు.. మీకు తెలుసా..?
పాత
మనుషులను ప్రింట్ చేసే మెషిన్‌‌.. ఈ ‘‘జెరాక్స్’’ వెబ్ సిరీస్ స్టోరీ భలే ఉందిగా..!
పాత
జియో హాట్ స్టార్లో నివిన్ పౌలీ ప్రతిఛాయ సినిమా.. చూడొచ్చా..? టైం వేస్టా..?
పాత
పేరే హ్యాపీ రాజ్.. ఫాదర్ సెంటిమెంట్తో ఏడిపించేశాడు.. ఈ సినిమాకు ఓటీటీలో మంచి టాక్ !
పాత
చెలరేగిన CSK కెప్టెన్ రుతురాజ్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే!
పాత
రుతురాజ్ ఒంటరి పోరాటం.. చెన్నై స్కోర్ ఎంతంటే
పాత
తెలంగాణ

రుతురాజ్ ఒంటరి పోరాటం.. చెన్నై స్కోర్ ఎంతంటే

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ చెన్నైని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై టాపార్డర్ గుజరాత్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రుతురాజ్ గైక్వాడ్ అండగా నిలిచాడు. బౌలర్లను ఎదురుకుంటూ పరుగులు రాబట్టాడు. 49 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా తను మాత్రం పకడ్బందీగా బ్యాటింగ్ చేశాడు. 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలింగ్‌లో రబాడా 3, అర్షద్ 2, సిరాజ్, సుతార్ తలో వికెట్ తీశారు.

హైదరాబాద్ లో ఖుల్లా నూనెపై నిషేధం... H-Fast అధికారుల స్ట్రాంగ్ వార్నింగ్..
పాత
ఆటో డివైడర్ ను ఢీ: ఇద్దరు మహిళలు మృతి
పాత
తెలంగాణ

ఆటో డివైడర్ ను ఢీ: ఇద్దరు మహిళలు మృతి

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా సదాశివ పేట మండలం నందికంది దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తుండగా ఆటో డివైడర్ ను ఢీకొంది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు లావణ్య(39), రుక్మిణి(42) గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణం ఆటో డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంబానీల కోటలో పాప్ సింగర్ రిహన్నా.. పెద్ద పండగే చేశారుగా..!
పాత
పెట్రోల్, డీజిల్ సరఫరాలో సమస్యలు లేకుండా చేయాలి: నాదెండ్ల మనోహర్
పాత
తెలంగాణ

పెట్రోల్, డీజిల్ సరఫరాలో సమస్యలు లేకుండా చేయాలి: నాదెండ్ల మనోహర్

అమరావతి: పెట్రోల్, డీజిల్ సరఫరాలో చిన్న పాటి లోపాలు మాత్రమే ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇబ్బంది సమయంలో కంపెనీలు సమర్ధవంతంగా పనిచేయాలని అన్నారు. కొరత సృష్టించి వినియోగదారులకు అసౌకర్యం తగదని, చమురు కంపెనీలు, డీలర్లతో అధికారుల వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ కన్నబాబు, డీలర్ల సంఘం ప్రతినిధులు, చమురు కంపెనీలు పాల్గొన్నారు. రేపు ఉ.6 లోగా అన్ని పెట్రోల్ బంకులకు డీజిల్, పెట్రోల్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఎక్కడా సరఫరా లో సమస్యలు లేకుండా చూడాలని, అధిగమించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని సూచించారు. చమురు కంపెనీల డిపోల వద్దకు వెళ్లి జెసిలు తనిఖీ చేయాలని, సరఫరాలో ఎక్కడా ఆలస్యం లేకుండా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. సోషల్ మీడియాలో అనవసరమైన ప్రచారం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

చందానగర్ లో దారుణం....హోటల్లో మహిళను హత్య చేసి పరారైన దుండగుడు...
పాత
ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో పాల్గొన్న సీఎం రేవంత్.. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు
పాత
Advertisement
Sponsored by ATA – American Telugu Association