9630 వార్తలు





హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తోందని, ప్రతి గింజ కేంద్రం కొనడంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలతో బిజెపి ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, ప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు “రైతు ఘోస – బిజెపి భరోసా” పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రామా అని మండిపడ్డారు. నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో రైతులపై సాగు వ్యయం భారీగా పెరిగిందని, ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు అన్నీ పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కానీ రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్న బిజెపి నేతలు ఈ అంశంపై ఒక్క మాట క


హైదరాబాద్: రాష్ట్రంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం తప్పక కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని అన్నారు. ఈ సందర్భంగా సిఎల్పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లారీల కొరత సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇసుక లారీలు, ట్రాక్టర్లను కూడా ధాన్యం తరలింపు కోసం వాడుతున్నామని తెలియజేశారు. ఈ లోపు వర్షం పడి ధాన్యం తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ధాన్యం తడిసి రంగు మారినా కొనుగోలు చేయాలని కలెక్టర్లను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై బిఆర్ఎస్, బిజెపి నాటకాలు ఆడుతున్నాయన, ధాన్యం కొనుగోళ్ల గురించి మాట్లాడే హక్కు బిజెపి నేతలకు లేదని విమర్శించారు.కేంద్రప్రభుత్వం 52 లక్షల టన్నులనే కొనుగోలు చేస్తామని చెప్పిందని, రాష్ట్రంలో కోటి టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చిందని అన్నారు. కేంద్రం మాత్రం 52లక్షల టన్నులకే మద్దతు ధర చెల్లిస్తామని చెప్పిందని, రాష్ట్రంలో మొత్తం ధాన్యం కొనాలని బిజెపి నేతలు కేంద్రానికి చెప్పాలని, బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయాలు ఆపి బిజెపి ప్రభుత్వం వద్

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రయాణం నిరాశతో ముగిసినప్పటికీ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం తన నాయకత్వ పటిమపై బలమైన వైఖరిని ప్రదర్శించాడు. సీజన్ ఆరంభంలో జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనప్పుడు కెప్టెన్సీని వదిలేయాలనే ఆలోచన తనకు ఏమాత్రం రాలేదని స్పష్టం చేశాడు. సవాళ్లను చూసి వెనకడుగు వేసే వ్యక్తిత్వం తనది కాదని, కష్టకాలంలోనే జట్టుకు అండగా నిలబడటం ముఖ్యమని అన్నాడు. ఈ సందర్భంగా రహానే మాట్లాడుతూ.. […] The post కష్టకాలంలోనే అసలైన వ్యక్తిత్వం తెలుస్తుంది: రహానే appeared first on Navatelangana.



మేడ్చల్: ప్రియురాలి నాలుకను ప్రియుడు కోసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడలో ఓ మహిళకు పది సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. దీంతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. నవీన్ అనే వ్యక్తి పరిచయం కావడంతో ఇద్దరు మధ్య సానిహిత్యం పెరిగింది. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు మధ్య గొడవ జరగడంతో తారాస్థాయికి చేరుకుంది. నవీన్ సహనం కోల్పోయి కత్తి తీసుకొని ఆమెపై దాడి చేశాడు. చాకుతో ఆమె నాలుకను కోయడంతో ఆమె కేకలు వేసింది. దీంతో నవీన్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.





ఐపిఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్.. విరాట్ కోహ్లీ మధ్య చిన్న గొడవ జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం హెడ్‌కి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి కూడా విరాట్ ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు తనని ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారని హెడ్ భార్య.. జెస్సికా హెడ్ ఆస్ట్రేలియన్ మీడియాతో అన్నారు. ‘వరల్డ్ కప్ విజయం తర్వాత ఎలాగైతే వేధింపులు ఎదురయ్యాయో.. ప్రస్తుతమూ అలాంటి వేధింపులే వస్తున్నాయి. నేను నిద్ర లేచే సరికి నా సోషల్‌మీడియా ఖాతాలు కామెంట్లతో హోరెత్తుతున్నాయ. నాకేమీ సమస్య లేదు. బాగానే ఉన్నాను. కానీ వారు నా స్నేహితులు, కుటుంబసభ్యులనూ వేధింపులకు గురి చేస్తున్నారు’ అని జెస్సికా తెలిపారు. ఇటీవల కాలంలో భారత్‌పై ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత కూడా ఇలాంటి వేధింపులు కొనసాగాయని.. 2023 వన్డే వరల్డ్ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వైనల్, 2024 బాక్సింగ్ డే టెస్ట్ కూడా ఉన్నాయని అమె వాపోయారు. ఈ వేధింపులలో గతంలో తమ చిన్న కుమార్తెను ఉద్దేశించి ఆందోళన కలిగించే బెదిరింపులు కూడా ఉన్నాయని ఆరోపించారు.

టాలీవుడ్ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉంది. ఆమె తాజాగా తెలుగులో ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. తాజాగా మరో సినిమా ఒప్పుకొంది. ఈ కొత్తగా ఒప్పుకున్న చిత్రం సితార బ్యానర్ తీస్తున్న సినిమా. మీనాక్షి ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఎక్కువ చిత్రాలు సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించినవే ఎక్కువ. గుంటూరు కారం (సితార మాతృ సంస్థ హారిక హాసిని నిర్మించింది), లక్కీ భాస్కర్, అనగనగా ఒక రాజు, ఇవన్నీ ఆ బ్యానర్ చిత్రాలే. తాజాగా కార్తీ హీరోగా దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో (మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల దర్శకుడు) ఈ సంస్థ తీస్తున్న కొత్త చిత్రంలో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్. అంటే ఈ బ్యానర్‌లో ఆమెకి ఇది నాలుగో చిత్రం.

నవతెలంగాణ – హైదరాబాద్ : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్‌లు జరగకుండా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన […] The post కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.

అమరావతి: మనకు జీవితాన్ని ఇచ్చే నదులను చంపవద్దు అని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సూచించారు. గోదావరి, కృష్ణా నదులను రక్షించుకోవాలని అన్నారు. పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్షించారు. గోదావరి తీరంలో ఉన్న పరిశ్రమల యజమానులతో పవన్ భేటీ అయ్యారు. నదిలో కాలుష్య నివారణ చర్యలపై మార్గనిర్దేశం చేశారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు ఆదేశించారు. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే 6నెలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని, జీవనదుల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. నదుల రక్షణకు ఇవాళ్టి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, గోదావరి, కృష్ణా నదులను కాలుష్యరహితంగా మార్చడమే లక్ష్యం అని రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు కీలకం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్వచ్ఛమైన నీటిని కలుషితం చేయడం, నదిలో తాగునీరు మురుగును కలపడం సరికాదని అన్నారు. మురుగునీటిని నేరుగా పంట కాలువల్లో కలిపేస్తున్నారని, పూర్తిగా శుద్ధి చేయకుండా నదిలోకి వ్యర్థాలు వదులుతున్నారని విమర్శించారు. ఆక్వా పరిశ్రమలు సైతం మరింత బాధ్యతగా వ్యవహరించాలని, జీవనదులను చేజేతులా కలుషితం చేసుకోవద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని తెలియజ




నవతెలంగాణ – హైదరాబాద్ : నిన్నటివరకు కలిసి నడిచిన మిత్రులు.. నేడు రాజకీయ శత్రువులుగా మారారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే, కాంగ్రెస్ మధ్య మొదలైన విభేదాలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఘాటు విమర్శలతో దక్షిణాది రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్‌ను ఇకపై ఎప్పటికీ నమ్మబోమంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కష్టకాలంలో డీఎంకేకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీనే అని ఎంపీ మాణికం […] The post బీజేపీని అడ్డుకోవడం కోసమే విజయ్‌తో కలిశాం: కాంగ్రెస్ ఎంపీ appeared first on Navatelangana.