🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4203 వార్తలు

జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి.. టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే..?
పాత వార్త
తెలంగాణ

జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి.. టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే..?

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మే 4 లేదా 5న విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 16న పరీక్షలు విజయవంతంగా పూర్తి కావడంతో వచ్చే నెల మొదటి వారంలో ఫలితాలను ప్రకటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు 5,17,760 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 5,16,534 మంది(99.76 శాతం) హాజరయ్యారు. మార్చి 14న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు ఈనెల 14వ తేదీ వరకు కొనసాగాయి. పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే, ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థులకు త్వరగా ఫలితాలను అందించాలనే ఉద్దేశంతో పరీక్షలు పూర్తికాకముందే ఈనెల 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ నెల 23న జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయ్యింది. పేపర్ల స్కానింగ్ ముగిసిన వెంటనే మార్కుల క్రోడీకరణ చేపడతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఎటువంటి సాంకేతిక సమస్యలు లేని పక్షంలో మే 4 లేదా 5వ తేదీల్లో ఫలితాలను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.

Adminఏప్రిల్ 26, 2026 - ఆదివారం👁 2
రూ.299 డ్రెస్ ఆర్డర్ చేస్తే.. లక్ష రూపాయలు ఊడ్చేశారు..! ముంబై నర్స్ ఎలా మోసపోయిందో చూడండి
పాత
జగిత్యాల జిల్లాలో విషాదం... బావిలో ఈతకు వెళ్లి బాలుడు మృతి...
పాత
కష్టాల్లో కోల్‌కతా.. 31 పరుగులకే 4 వికెట్లు నష్టపోయిన కేకేఆర్
పాత
అలర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్
పాత
తెలంగాణ

అలర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్

మూడు రోజుల పాటు తీవ్రమయిన వడ గాలులురాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు మిశ్రమ వాతావరణం ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం అయినా పెరగనున్న ఉష్ణోగ్రతలు వెల్లడించిన వాతావరణ శాఖ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి మహోగ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం నుంచే తీవ్రమయిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచి భానుడు ప్రతాపం, మధ్యాహ్న సమయంలో విపరీతంగా వడగాల్పులు వీస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల పాటు తీవ్రమయిన వడగాలులు ఉంటాయని తెలంగాణ వెథర్‌మ్యాన్ హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 27 నుంచి దక్షిణ తెలంగాణలో ఉరుములతో వర్షాలు, ఏప్రిల్ 30 వరకు వడగాలులు ఉంటాయని తెలిపారు. కాగా, ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిలా మారాయని, ఆదివారం ఆదిలాబాద్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, హైదరాబాద్‌లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యిందని, వచ్చే మూడు రోజులు వడగాలులు మరింత ఉధృతంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో రాబోయే మూడు రోజుల పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల మధ్

బెంగాల్‌లో గూండా రాజ్యం నడుస్తోంది: టిఎంసిపై రాహుల్ గాంధీ ఫైర్
పాత
తెలంగాణ

బెంగాల్‌లో గూండా రాజ్యం నడుస్తోంది: టిఎంసిపై రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో అధికాక తృణమూల్ కాంగ్రెస్ భయానక పాలన సాగుతోందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేబ్‌దీప్ ఛటర్జీ ఇటీవలే దారుణ హత్యకు గురయ్యారు. టిఎంసి గూండాలే ఈ దారుణానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అధికార దర్పంతో వ్యవహరిస్తున్న టిఎంసి సంబంధిత వ్యక్తులు తమ పార్టీ కార్యకర్తపై దాడికి దిగి తీవ్రంగా గాయపర్చారని, తరువాత ఆయన చనిపోయ్యాడని రాహుల్ తెలిపారు. రాష్ట్రంలో టిఎంసి గూండాగిరి సాగుతోంది. దేశంలో కొనసాగుతూ వస్తోన్న అహింసాత్మక సంవిధానానాకి ఇటువంటి ఘటనలు మచ్చ తీసుకువస్తాయని రాహుల్ తెలిపారు. అసనోల్ నార్త్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా ఉన్న ప్రసేన్ జిత్ పుయితనిధికి అత్యంత నన్నిహితుడు అయిన కార్యకర్త ఛటర్జీ హత్య పై కాంగ్రెస్ నేత తీవ్రస్థాయిలో స్పందించారు బెంగాల్‌లో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదని, ఇక్కడ టిఎంసి భయోత్పాతక రాజ్యం సాగుతోందని తెలిపారు. తమ పార్టీ కాంగ్రెస్ ఎప్పుడూ హింసాత్మక చర్యలకు దిగలేదు. ఇకపై కూడా దిగబోదని స్పష్టం చేశారు. కార్యకర్తలంటే పార్టీలో ప్రాణంతో సమానం అని తెలిపారు.

ఎస్‌ఐఆర్ వల్ల నకిలీ ఓట్లను తొలగించవచ్చు: కిషన్ రెడ్డి
పాత
తెలంగాణ

ఎస్‌ఐఆర్ వల్ల నకిలీ ఓట్లను తొలగించవచ్చు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రజాస్వామ్య దేశంలో జనాభా లెక్కల సేకరణ గొప్ప కార్యక్రమం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జనగణనలో భాగంగా ఆయన ఆదివారం స్వీయ ధృవీకరణ చేసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జనగణనలో తొలిసారి కులగణన జరుగుతోందని పేర్కొన్నారు. వివరాలు చెప్తే సంక్షేమ పథకాలు తొలగిస్తారనే భయం వద్దన్నారు. అందరూ ధైర్యంతో వివరాలు ఇవ్వాలి అని కోరారు. ‘‘ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను అభినందించాలి. దీని వల్ల నకిలీ ఓట్లు తగ్గించొచ్చు. నకిలీ ఓట్ల తొలగింపుతో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. హైదరాబాద్‌లో పోలింగ్ పర్సంటేజ్ 50 శాతం కూడా దాటడం లేదు. ఎస్ఐఆర్ పూర్తయితే ఇక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధాని మోడీ రైల్వే, జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు అక్కడికక్కడే మృతి
పాత
తెలంగాణ పైన మళ్ళీ కుట్రలు ప్రారంభమయ్యాయి..
పాత
తెలంగాణ

తెలంగాణ పైన మళ్ళీ కుట్రలు ప్రారంభమయ్యాయి..

హైదరాబాద్: తెలంగాణ పైన మళ్ళీ కుట్రలు ప్రారంభమయ్యాయని, అన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘు, హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో కలిసి కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుటిల ప్రయత్నాలు, తెలంగాణ వ్యతిరేక కుట్రలు చేసినా ప్రజలు రానున్న శాసనసభ ఎన్నికల్లో కెసిఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలు మారిన తర్వాత ఏ నాయకుడికి ఉనికి ఉండదని చెప్పారు. హుజూర్‌నగర్‌లో పార్టీ మారిన ఎంఎల్‌ఎ కనీసం తన సొంత గ్రామంలో సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేని పరిస్థితికి దిగజారిపోయారని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి గులాబీ పార్టీలో చేరిన పిల్లుట్ల రఘుకి కెటిఆర్ అభినందనలు తెలిపారు. హుజూర్‌నగర్ నియో

టిఆర్ఎస్ ఏర్పాటుతో బిఆర్‌ఎస్ వెన్నులో వణుకు పుట్టింది..
పాత
తెలంగాణ

టిఆర్ఎస్ ఏర్పాటుతో బిఆర్‌ఎస్ వెన్నులో వణుకు పుట్టింది..

తెలంగాణ అస్తిత్వాన్ని గాలికొదిలేసినోళ్లాఒరిజినల్ గురించి మాట్లాడేది బిఆర్‌ఎస్ నాయకులకు తెలంగాణ రాష్ట్ర సేనా నేతల కౌంటర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్‌ఎస్) ఏర్పాటుతో బిఆర్‌ఎస్ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిందని ఆ పార్టీ నాయకులు అన్నారు. కవిత ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్‌తో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మతి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎల్. రూప్ సింగ్, రంగు నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్, గొంగళ్ల రంజిత్ కుమార్, మంచాల వరలక్ష్మీ, నరేశ్ ప్రజాపతి మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ పేరుతో కవిత పార్టీ పేరు ప్రకటించగానే బిఆర్‌ఎస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒరిజినల్, డూప్లికేట్ అంటూ చేసిన పోస్టులు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌కు నిజమైన హక్కుదారు కవితక్కనే అని రంగు నవీన్ ఆచారి అన్నారు. బిఆర్‌ఎస్ వదిలేసిన తెలంగాణవాదాన్ని కవిత భుజాన ఎత్తుకున్నారని గుర్తు చేశారు. అధికారం వచ్చిన వెంటనే తెలంగాణవాదాన్ని, ఉద్యమకారులను వదిలేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌ది కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణవాదులను లాఠీలతో కొట్ట

తెలంగాణలో జనగణన 2027 స్వీయ నమోదు ప్రారంభం
పాత
తెలంగాణ

తెలంగాణలో జనగణన 2027 స్వీయ నమోదు ప్రారంభం

రాష్ట్రంలో జనగణన 2027 స్వీయ- నమోదు ప్రారంభంలోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా శ్రీకారం ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ పిలుపు మన తెలంగాణ / హైదరాబాద్ : జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో స్వీయ నమోదు ప్రక్రియను ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. లోక్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆన్‌లైన్ ద్వారా స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. జనాభా గణన ఒక కీలక జాతీయ కార్యక్రమమని పేర్కొన్నారు. ఇది దేశంలోని జనాభా, వారి సామాజిక-, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం అందించడంతో పాటు, సమర్థవంతమైన ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి పునాదిగా నిలుస్తుందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో విధానాల రూపకల్పనలో జనగణన ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు. కచ్చితమైన సమాచారంతో లక్ష్యిత సంక్షేమ పథకాలు రూపొందించడమే కాకుండా, దేశ పురోగతిని సమర్థవంతంగా అంచనా వేయడానికి ఇది సహకరిస్తుందని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో ఇదే మొదటి జనాభా గణన కావ

సీఎస్కేపై ఈజీగా గెలిచిన గుజరాత్
పాత
స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలి
పాత
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
పాత
తెలంగాణ

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్నవతెలంగాణ-రాజన్న సిరిసిల్లశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై శ్రీ వాసవి మాత చిత్ర పటానికి పుష్పమాల వేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఏ రాందాస్, సీపీఓ శ్రీనివాసాచారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు. The post శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు appeared first on Navatelangana.

చెన్నై చిత్తు.. ఘన విజయం సాధించిన గుజరాత్
పాత
తెలంగాణ

చెన్నై చిత్తు.. ఘన విజయం సాధించిన గుజరాత్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్‌కె 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని జిటి 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ 87 పరుగులతో రాణించాడు. బటర్ల్ (39 నాటౌట్), గిల్ (33) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో గుజరాత్ 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. చెన్నై ఒక స్థానం కోల్పోయి.. 6 స్థానానికి పడిపోయింది.

ద్విచక్రవాహన దొంగ అరెస్ట్
పాత
తెలంగాణ

ద్విచక్రవాహన దొంగ అరెస్ట్

నవతెలంగాణ – కామారెడ్డి కామారెడ్డి మండలం మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి, దొంగిలించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చుక్కాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు ఇందూరి ఎల్లగౌడ్ తన స్కూటీ దొంగిలించబడిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తులసి ఆయిల్ మిల్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతను […] The post ద్విచక్రవాహన దొంగ అరెస్ట్ appeared first on Navatelangana.

KKR vs LSG మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
పాత
నో రెజ్యూమె.. 10 నిమిషాలు మాట్లాడి సెలెక్ట్ చేస్తారు.. బెంగళూర్ కంపెనీ హైరింగ్ విధానం వైరల్
పాత
సుదర్శన్ 'కిరాక్' బ్యాటింగ్.. సీఎస్‌కేపై 8 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం
పాత
ట్రాన్స్ జెండర్ ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గల్లా మాధవి... మంత్రి లోకేష్ ప్రశంసలు..
పాత
రేపు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారె పర్యటన
పాత
తెలంగాణ

రేపు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారె పర్యటన

– కార్యక్రమ వివరాలు వెల్లడించిన కార్యాలయ సిబ్బందినవతెలంగాణ – అశ్వారావుపేటప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొననున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన కార్యాలయ సిబ్బంది కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఉదయం 9 గంటలకు తిరుమలకుంట గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు […] The post రేపు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారె పర్యటన appeared first on Navatelangana.

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
పాత
తెలంగాణ

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా ఏడు మ్యాచులు ఆడితే రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించి.. గెలుపు ఖాతా తెరిచింది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు లక్నో వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం లక్నోకి కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో లక్నో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సిద్ధార్త్ స్థానంలో లిండే జట్టులోకి వచ్చాడు. కోల్‌కతా గత మ్యాచ్‌లోని జట్టునే కొనసాగిస్తోంది. తుది జట్లు: ఎల్‌ఎస్‌జి: ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, ముకుల్ చౌదరీ, జార్జ్ లిండే, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, మోసిన్ ఖాన్. కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), టిమ్ సీఫర్ట్(కీపర్), కామరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రోమ్‌మెన్ పోవెల్, రింకూ సింగ్, సునీల్ సరైన్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ.

మళ్లీ మొదలైన డీజిల్ తిప్పలు.. పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు
పాత
పార్టీని వీడిన ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి: రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి
పాత
తెలంగాణ

పార్టీని వీడిన ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి: రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి

నవతెలంగాణ – న్యూఢిల్లీ : అశోక్ కుమార్ మిట్టల్, రాఘవ్ చద్దాతోపాటు ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలో వీలైనమనట్లు శుక్రవారం ప్రకటించారు. తాజాగా ఈ ఎంపీలందరిపై అనర్హత వేటు వేయమని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ఆదివారం రాజ్యసభ ఛైర్మన్ సి. పి రాధాకృష్ణన్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటువంటి ఫిరాయింపులు ముఖ్యంగా పంజాబ్‌లో ప్రజల తీర్పుకు ద్రోహం చేయడమే కాకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని` ఆయన ఆరోపించారు. […] The post పార్టీని వీడిన ఏడుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి: రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి appeared first on Navatelangana.

Advertisement
Sponsored by ATA – American Telugu Association