
డిఎంకె అధినేత, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కు తమిళ ప్రజలు బిగ్ షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్ ఓటమిపాలయ్యారు. కొళత్తూరులో సిఎం స్టాలిన్ పై టివికె అభ్యర్థి విఎస్ బాబు గెలుపొందారు. మరోవైపు, చేపాక్ నుంచి పోటీ చేసిన ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కాగా, టివికె విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన తొలిసారే అధికారం దిశగా దూసుకుపోతోంది. వందకు పైగా స్థానాల్లో టవికె ముందంజలో కొనసాగుతోంది. దీంతో విజయ్.. ముఖ్యమంత్రిగా తమిళనాడులో చక్రం తిప్పనున్నాడు.











