
మనలో చాలా మంది పండ్లు, కూరగాయలు తాజాగా ఉండటానికి రిఫ్రిజిరేటర్లను ఉపయోగిస్తాం. అలా చేయడం వల్ల వాటిలోని ముఖ్యమైన పోషకాలు తగ్గిపోవచ్చు. రిఫ్రిజిరేటర్‌లోని ఉష్ణోగ్రతలు కొన్ని ఆహార పదార్థాలకు అనువైనవి కావు. అయితే, రిఫ్రిజిరేటర్ లేకుండా కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండే కొన్ని కూరగాయలు ఉన్నాయని మీకు తెలుసా? ఇవి అవసరమైన పోషకాలను కోల్పోకుండా కూడా అనేక ఆరోగ్య లాభాలను అందిస్తాయి. మరి రిఫ్రిజిరేటర్ లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే కూరగాయ లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంపలు
బంగాళాదుంపలలో సహజంగా పిండిపదార్థం( స్టార్చ్) అధికంగా ఉంటుంది. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే వాటిపై నల్ల మచ్చలు ఏర్పడి, కుళ్లిపోతాయి. పైగా వాటి రుచి కూడా మారిపోతుంది. అందువల్ల బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవడానికి వాటిని కూల్, ఓపెన్ ప్లేస్ లో నిల్వ చేయడం బెస్ట్.
టమోటాలు
టమోటాలను కూడా ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి త్వరగా పాడైపోయి, మెత్తగా అవుతాయి. వీటిని ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే చల్లని, గాలి తగిలే ప్రదేశంలో స్టోరేజ్ చేయాలి.
ఉల్లిపాయలు
ఉల్లిపాయలను ఎక్కువ పరిమాణంలో ఉంటె, వాటిని పొడి ప్రదేశంలో నిల్వ చేయవచ్చు. తరిగిన ఉల్లిపాయలను వెంటనే ఉపయోగించాలనుకుంటే వాటిని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫ్రిజ్‌లో పెడితే అది పాడైపోయి నల్లగా మారిపోతుంది.
వెల్లుల్లి
భారతీయ వంటకాలలో ఒక ముఖ్యమైన కూరగాయ వెల్లుల్లి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టకుండా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వీటిని కూరగాయల బుట్టలో నిల్వ చేయవచ్చు.
తేనె
తేనెలో సహజంగా నిల్వచేసే గుణాలు ఉంటాయి. చాలా సంవత్సరాల పాటు నిల్వ ఉంచుకుని తినవచ్చు. అందువల్ల, దీనిని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు.












