
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని కరాచీ సైనిక స్థావరంపై దాడి విషయంలో భారత్‌ను నిందించడం పనికిరాని పని అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. కరాచీ ఎయిర్‌బేస్‌పై దాడి ఘటనలో నలుగురు పారామిలిటరీ సిబ్బంది హతులయ్యారు. ఈ ఘటన వెనుక భారత శక్తుల ప్రమేయం ఉందని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మెహిసిన్ నక్వీ ఆరోపించారు.
నక్వీ ఆరోపణలపై స్పందించిన రణదీర్.. పాక్ చురకలంటించారు."ఇటువంటి వితండవాదాన్ని పాక్ మానుకోవాలి. ముందు ఈ దేశం తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ నేలపై ఉన్న ఉగ్రవాద కార్యలాపాల స్థావరాలను ముందుగా నిర్మూలించాల్సి ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి చివరికి ఈ విధంగా విద్రోహ చర్యలకు పాక్ వేదిక అవుతోంది" అని పేర్కొన్నారు.












