
5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
పశ్చిమ బెంగాల్ ఫలితంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
తమిళనాడు, కేరళంపై సరత్రా టెన్షన్ అసోం, పుదుచ్చేరిపైనా ఆసక్తి
దీదీకి కమలం చెక్? స్టాలిన్ కుర్చీకి విజయ్ గండం!
కేరళంలో ఈసారి యూడీఎఫ్‌కు సానుకూల పవనాలు అసోం, పుదుచ్చేరిలో కమల వికాసంపై ఆశలు
కౌంటింగ్‌కు ఆయా రాష్ట్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు
న్యూఢిల్లీ: నేడు (మే 4) నాలుగు రాష్ట్రాలు , ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రం మారుతుం దా? సరికొత్త దిశా నిర్థేశనం జరుగుతుందా? అనే ది ఈ ఎన్నికల ఫలితాలతో మధ్యాహ్నానికి ఖరారు అవుతుంది. ఈసారి ఎన్నికలలో తమిళనాడు, ప శ్చిమ బెంగాల్, కేరళలో హోరాహోరీ రాజకీయ పోరు జరిగింది. ఈసారి ప్రత్యేకించి బెంగాల్, తమిళనాడులలో ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతం అయింది. ఈ రెండు రాష్ట్రాలు చాలాకాలం గా బిజెపి సారధ్యపు ఎన్‌డిఎ పరిధిలో లేని ప్రభుత్వాలతో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోకి బిజెపి చొరబడే అవకాశాలు లేవని ఇంతకాలం భావిస్తూ ఉన్న దశలో ఇందుకు భిన్నమైన జన స్పందన ఈ సారి వెలువడనుందనే విశ్లేషణలతో ఈ ఫలితాల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి ఫలితం అ టు బిజెపికి మరో వైపు ప్రతిపక్షాలు అయినటిఎం సి, డిఎంకె, వామపక్షాలకు, మొత్తం మీద కాంగ్రెస్‌కు రాజకీయంగా ప్రభావిత అంశం కానుంది. నిజమైన ఫలితాలకు ముందు వెలువడ్డ ఎగ్జిట్ పో ల్స్‌లో ఈసారి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తం పుదుచ్చేరి ఫలితాల గురించి తమ కథనాలు వెల్లడించారు.
ఇందులో ఈసారి బెంగాల్‌లో టి ఎంసి అధికారం కోల్పోతుందని, బిజెపి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.తమిళనాడులో కొంత మేరకు పోపోటాపోటీ ఉన్నా, ఇక్కడ అధికార డిఎంకెకు తిరిగి పట్టం తప్పదని విశ్లేషించారు. కేరళలో ఈసారి అధికార ఎల్‌డిఎఫ్,కాంగ్రెస్ నాయక త్వ యుడిఎఫ్‌కు మధ్య పోటీలో యుడిఎఫ్‌కు ఆధిక్యత ఉందని తెలిపారు. ఇక అసోంలో బిజెపి తిరుగులేని విజయం సాధిస్తుందని, పుదుచ్చేరిలో బిజెపి నాయకత్వ కూటమి అధికారం ఖాయం అని సర్వేలు తేల్చాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రాలను మార్చడమే కాకుండా, దేశంలో లోక్‌సభ ఎన్నికల నాటికి తలెత్తే రాజకీయ సమీకరణలకు ప్రతీక అవుతుందని విశ్లేషణలు వెలువడ్డాయి.
బెంగాల్‌పైనే అందరి దృష్టి
పశ్చిమ బెంగాల్‌లో దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్‌లోనూ బిజెపికి ఈసారి అవకాశం ఉందని తేల్చారు. అయితే ఈ విశ్లేషణలను మమతా బెనర్జీ తిప్పికొడుతున్నారు. టిఎంసిదే వరుసగా నాలుగోసారి విజయం అని మమత ప్రకటిస్తున్నారు. అయితే అమిత్ షా కన్నా ఎక్కువగా ప్రధాని మోడీ ఇక్కడ బిజెపిదే అధికారం అని ధీమాతో ఉన్నారు. తిరిగి బిజెపి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఈ నెల 4వ తేదీన ఫలితాల తరువాతనే వస్తానని చెప్పి ఢిల్లీకి వెళ్లారు. బెంగాల్‌లో గెలవడాన్ని బిజెపి అత్యంత ప్రధానంగా భావిస్తోంది.
ఇక్కడ 148 స్థానాలను దాటి విజయం సాధిస్తే, బీహార్‌లో పక్షం రోజుల క్రితం బిజెపి తొలిసిఎం వచ్చినట్లే ఇక్కడ కూడా బిజెపి నేతకు చాన్స్ ఉంటుంది. బెంగాల్‌లో కమలం వికసిస్తుందని ఢిల్లీలోని ఇద్దరు నేతలు అమిత్ షా, మోడీలు ఆశిస్తున్నారు. బెంగాల్‌లో మరోసారి విజయం ఇప్పుడు మమత బెనర్జీకి అత్యంత ప్రాధాన్యత అంశం అయింది. ఇక్కడ తిరిగి గెలిస్తే బిజెపికి జాతీయ స్థాయిలో సవాలు విసిరేందుకు ఆమెకు వీలు అవుతుంది. అంతకు మించి బెంగాల్‌లో తన కన్నా తిరుగులేని నాయకత్వం లేదని జాతీయ స్థాయిలో చెప్పడానికి వీలవుతుంది. ఈసారి టిఎంసి పోటీ బిజెపితోనే కాకుండా ఎన్నికలసంఘంతోనే సాగినంత వేడి రగిలింది. ఈసారి బెంగాల్‌లో వివాదాస్పద రీతిలోనే కౌంటింగ్‌కు కేంద్ర ఉద్యోగులను రంగంలోకి దింపారు. మరో వైపు బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలలో 432 మంది పరిశీలకులను నియమించారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా కేంద్ర బలగాలు, కేంద్ర పరిశీలకులు రావడంపై టిఎంసి అభ్యంతరం చెప్పింది. అయితే పలితం లేకుండా పోయింది. బెంగాల్‌లో ఈసారి సర్ అత్యంత కీలక అంశం అయింది. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ఆరంభమవుతుంది. ఇప్పుడున్న ఇవిఎంల సాంకేతికత కౌంటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో మధ్యాహ్నానికి దాదాపుగా గెలుపోటములుపై స్పష్టత రానుంది.
డిఎంకెదే గెలుపు..విజయ్ ట్రంప్ కార్డు?
కేరళలో గెలుపోటములు సిపిఎం, కాంగ్రెస్‌కు సవాలే
తమిళనాడులో 234 స్థానాల అసెంబ్లీలో ఈసారి కూడా స్టాలిన్ సారధ్య డిఎంకెనే విజయం సాధిస్తునందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి అయితే కొన్ని సంస్థల విశ్లేషణలో ఇక్కడ హీరో విజయ్ పార్టీ టివికె ప్రాబల్య రీతిలో సీట్లు దక్కించుకుంటుందని, చివరికి ఇది ఇక్కడ రాజకీయాథికారం మార్పునకు కూడా దారితీయవచ్చునని భావిస్తున్నారు. విజయ్ పార్టీకి అన్నాడిఎంకె కూటమి కన్నా ఎక్కువ సీట్లు వస్తే, డిఎంకెకు సవాలు విసిరేందుకు కేంద్ర బిజెపి నాయకత్వం సిద్ధం అవుతుందని విశ్లేషించారు.కేరళలో అధికారం ఈసారి కాంగ్రెస్‌కు అత్యంత కీలకం కానుంది. సిపిఎం కూడా ఇక్కడ గెలుపోటమలును అగ్ని పరీక్షగా ఎంచుకుంది. జాతీయ స్థాయిలో బలాన్ని కేరళలో అధికారం నిలబెతుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇక జాతీయ స్థాయిలో తన ఉనికిని చెదరకుండా చేసుకునేందుకు కేరళలో ఎల్‌డిఎఫ్ విజయం అవసరం అని సిపిఎం నేతలు ఈ ఫలితాన్ని కీలకంగా భావిస్తున్నారు. కేరళ ఒక్కటే సిపిఎంకు ఇప్పుడు గెలిచేందుకు అవకాశం ఉన్న రాష్ట్రం.పుదుచ్చేరిలో ఎఐఎన్‌ఆర్‌సి నాయకత్వపు ఎన్‌డిఎ తిరిగి పవర్ కాపాడుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ దిశలో ఇక్కడ కూటమి గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం అయింది. తమిళనాడులో ఎటువంటి పలితం ఉన్నా ఇక్కడ తిరిగి అధికారం కీలకం అని ఎన్‌డిఎ భావిస్తోంది. అయితే ఈసారి పొరుగున ఉ న్న తమిళనాడులో డిఎంకె, కాంగ్రెస్ ప్రాబల్యం ప్రబావం పుదుచ్చేరిలో కూడా పడుతుందని కాంగ్రెస్, డిఎంకె కూటమి భావిస్తోంది. అయితే ఇక్కడ ఫలితం తిరిగి పాతకూటమికే అనే సంకేతాలను ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.









