నవతెలంగాణ హైదరాబాద్: ముషీరాబాద్ బోలక్‌పూర్‌లోని ప్లాస్టిక్ గోదాముల్లో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోదాములు ఒకదానికొకటి ఆనుకొని ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది చుట్టుపక్కల ఇండ్లను ఖాళీ చేయించారు. పలు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.
The post ముషీరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం… appeared first on Navatelangana.











