కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. సీనియర్ నేత మదన్ మిత్రా బుధవారం అసెంబ్లీలో విపక్ష నేత రితబ్రా బెనర్జీ నేతృత్వం లోని రెబెల్ వర్గంలో చేరారు. తాను టీఎంసీలోనే ఉన్నానని, టీఎంసీ లోనే కొనసాగుతానని మదన్ మిత్రా వెల్లడించారు. పశ్చిమబెంగాల్ నార్త్ 24 పరగనాస్ జిల్లాలో ఉన్న కామర్‌హాతి సీటు నుంచి ఎమ్‌ఎల్‌ఎగా గెలుపొందిన తాను మమతా బెనర్జీ అనుసంధాన కాలిఘాట్ టిఎంసీ అజమాయిషీలో ఉన్న అన్ని జాతీయ, రాష్ట్ర సంస్థాగత కమిటీల పదవులకు రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీ లోని పార్టీ చీఫ్ విప్ పదవిని కూడా ఆయన వదులుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను ఇంటిని విడిచిపెట్టలేదని, గదిని మాత్రమే మార్చానని , తాను టిఎంసీ లోనే ఉంటానని పేర్కొన్నారు.