
మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబందించి త్వరలోనే శుభవార్త వినబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి కింద 90 టిఎంసిలు నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలను ఒప్పించి అనుమతులు సాధించే దిశగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. డిండి ప్రాజెక్టుకు సంబందించి 30 టిఎంసీల నీటి కేటాయింపులపైన కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని సిఎం వెల్లడించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోని ఐటి పార్కులో అమర రాజా కంపీనికి చెందిన కష్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంటును ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ కృష్ణా పరివాహక ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న డిండి,పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిలసాగర్, ఆర్‌డిఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి సమస్యలు పరిస్కరించుకోవడానికి పక్క రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే. నేను ఈ పాలమూరు వాడిగా అత్యంత వెనుబడిన ఈ జిల్లాను అత్యంత అభివృద్ది చెందిన ,ఆదర్శవంతమైన జిల్లాగా అభివృద్ది చేసుకుందామని జిల్లా వాసులకు పిలుపునిచ్చారు. వాతావరణంలో శరవేగంగా మార్పులొస్తున్నా యి. ఎలినోవ కారణంగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించుకొని కాలుష్య రహిత దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలంటే వాహన కాలుష్యా న్ని నియంత్రించాలి. అందుకు ఈవి వాహనాల వినియో గం పెరగాలని సిఎం సూచించారు. ఈవి బ్యాటరీల ప్రా ధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో 32 గిగాబైట్ సామ ర్థం కల్గిన యూనిట్ అమరరాజా స్థాపించడం సంతో షం.అమర రాజాలో 700మంది ఉద్యోగుల్లో 400 మం ది మహిళలు ఉండడం గర్వకారణమని సిఎం అన్నారు. అమర రాజా సంస్థ ప్రపంచంతో పోటీ పడే సంస్థ లోకల్ టాలెంట్‌తో గ్లోబల్ సంస్థలతో పోటి పడుతున్న అమర రాజాతో పోటీ పడే సంస్థ ఏదీ లేదు. చైనా,జపాన్, జర్మనీతో కొన్ని అంశాల్లో సౌత్ కొరియాతో పోటీ పడుతుం ది. దేశాలనే ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నదని అమర రాజాను అభినందించారు. ప్రపంచంలో ఎంత అభివృద్ది చెందిన దేశమైనా ఈవి బ్యాటరీలు,
ఈవి వాహనం కావాలన్నా,ఈవికి సంబందించిన ఏ ఉత్పత్తి అయినా చైనా మీద ఆధారపడుతుంది. అలాంటి దేశంతోనే పోటీ పడడానికి ప్రయ త్నం చేస్తున్న అమర రాజా యాజమాన్యాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిట శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపిలు డికె అరుణ, మల్లురవి, ఎమ్మెల్యేలు యన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి, వంశీ కృష్ణ, మధుసూధన్‌రెడ్డి, వీరంపల్లి శంకర్, అమర రాజా పరిశ్రమ సిఎండి గల్లా జయదేవ్, విక్రం ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఖుస్బూ, జిల్లా ఎస్‌పి జానకీ తదితరులు పాల్గొన్నారు.












