
118 మంది సభ్యుల జాబితాతో
రావాలని టివికె అధినేత విజయ్‌కు
మరోసారి స్పష్టం చేసిన తమిళనాడు
గవర్నర్ టివికెకు మెజార్టీ లేదని
గవర్నర్ స్పష్టం చేసినట్లు లోక్‌భవన్ ప్రకటన
చెన్నై: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మ రోసారి టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు అభ్యర్థనను తిరస్కరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని, వారి సంతకాలతో రావాలని విజయ్‌కు సూచించినట్లు సమాచారం. గురువారం వి జయ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అయితే టీవీకేకు ఇంకా పూర్తి మెజారిటీ లేదని గవర్నర్ పేర్కొన్నట్లు వర్గాలు తెలిపాయి. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో మద్దతు నిరూపిస్తేనే ప్రమాణ స్వీ కారం జరుగుతుంది అని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అస్థిరత రా కుండా ఉండేందుకు లిఖితపూర్వక మద్దతు అవసరమని గ వర్నర్ అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. మరోవైపు, ఇతర ఏ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించబోనని కూ డా విజయ్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. టీవీకే అ వసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించి తిరిగి వస్తే విజయ్ ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, అ న్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి గవర్నర్‌ను కలిసేందుకు ఇప్పటివరకు అపాయింట్‌మెంట్ కోరలేదని సమాచా రం. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ గడువు మే 9తో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారా యి. బుధవారం కూడా విజయ్ 112మంది ఎమ్మెల్యేల మ ద్దతుతో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నించారు. తమిళనాడులో ప్ర భుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్‌కు అవకాశం ఇవ్వాలని వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కోరారు. విజయ్ అసెంబ్లీలో మెజారిటీని తర్వాత నిరూపించుకునే అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కు లభించినప్పటికీ, ఆ మద్దతును గవర్నర్‌కు మౌఖికంగానే తెలియజేసినట్లు సమాచారం. ఇంకా మరికొంత మద్దతు కూడగట్టేందుకు సమయం ఇ వ్వాలని విజయ్ కోరినట్లు తెలుస్తోంది. అయితే అవసరమై న సంఖ్యాబలం ఇంకా లేదని పేర్కొంటూ, 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రావాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కసరత్తు ప్రారంభమైంది.
ప్రాంతీయ మీడియాతో మాట్లాడిన తిరుమావళవన్, తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. టీవీకేను ప్రజలు అతిపెద్ద పార్టీగా ఎన్నుకున్నా రు. అందువల్ల విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకా శం ఇవ్వాలి. అదే రాజ్యాంగం సూచించే మార్గం అని ఆయన అన్నారు. అమిత్ షా, ప్రధాని మోదీ తమిళనాడు రాజకీయాల్లో గందరగోళం సృష్టిస్తున్నారని కూడా విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ తమిళనాడు విభాగం కూడా గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరింది. ప్రమాణ స్వీకారానికి ముందే మెజారిటీ నిరూపించాలని అడగడం తగదని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ద్రవిడ పార్టీలకు గట్టి షాక్ ఇచ్చి, డీఎంకే-అన్నాడీఎంకే మూడు దశాబ్దాల రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలికింది. విజయ్ గెలిచిన రెండు స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో అసెంబ్లీలో టీవీకే బలం 107కి తగ్గనుంది. కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు తో కలిపి ప్రస్తుతం కూటమి బలం 112కు చేరింది. మెజారిటీకి ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఆర్టికల్ 164(1) ప్రకారం ము ఖ్యమంత్రిని నియమించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. స్పష్టమైన మెజారిటీ లేని పరిస్థితుల్లో ఎవరిని ఆహ్వానించాలన్న విషయం లో గవర్నర్‌కు విచక్షణాధికారం ఉంటుంది. గతంలో పలు రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీ నేతను మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్లు ఆహ్వానించారు.












